సినిమాల ప్రమోషన్స్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 27 , 2026 | 06:21 PM
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ప్రమోషన్స్ వచ్చేశాయి.. అయినా సరే.. ప్రమోషన్స్ ఎంత వరకు రీచ్ అవుతున్నాయనేది అర్థం కావడం లేదంటూ.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ప్రమోషన్స్ వచ్చేశాయి.. అయినా సరే.. ప్రమోషన్స్ ఎంత వరకు, ఎవరికి రీచ్ అవుతున్నాయనేది అర్థం కావడం లేదంటూ.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bharadwaj) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య తిరువీధుల నిర్మాణంలో తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సందిగ్ధం’ (Sandigdham). నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి హీరోహీరోయిన్లుగా నటించగా.. ‘తెర చేప’ ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్ర పోషించారు. మే 29న రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Sandigdham Pre Release Event)ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో టైటిల్స్ ఎలా పడితే అలా పెడుతున్నారు. ‘సందిగ్ధం’ అనే టైటిల్ చాలా బాగుంది. అచ్చమైన తెలుగులో టైటిల్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అడవుల్లో ఎంతో కష్టపడి మూవీని చేశారని టీజర్, ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ విషయంలో పద్దతి అంతా మారిపోయింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు చేరింది. అసలు చేసే ప్రమోషన్ ఎవరి వరకు రీచ్ అవుతోందనేది కూడా తెలీడం లేదు. నాలాంటి వాడికి ఇన్‌స్టాగ్రామ్ ఉండదు. మరి నాకు ఎలా తెలుస్తుంది. ఇలాంటి చిన్న సినిమాలను అందరూ ముందుండి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సినిమా ఆడుతుందా? లేదా? అనేది తర్వాత విషయం. అసలు మూవీ ఒకటి వస్తుందనే విషయం అందరికీ తెలియాలి కదా. అందరూ ఈ సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేయాలని, ‘సందిగ్ధం’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
చిత్ర దర్శకుడు పార్ధసారథి (Director Pardasaradhi Kommoju) మాట్లాడుతూ.. మా సినిమాకు మీడియా చేస్తున్న సపోర్ట్‌ను మరిచిపోలేము. మా కోసం ఇక్కడకు వచ్చిన తమ్మారెడ్డికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నిర్మాత, నా భార్య సంధ్య ఎంతో సహకరించింది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్స్. అందరూ ఎంతగానో సహకరించారు. ‘సందిగ్ధం’తో మేం ఆశించిన విజయం దక్కుతుందని నమ్ముతున్నాం. చిన్న సినిమాల్ని తీయడం కంటే ప్రమోట్ చేయడం, విడుదల చేయడం చాలా కష్టం. మే 29న వస్తున్న మా సినిమాకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం మాట్లాడుతూ.. సినిమాను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను, సపోర్ట్ చేయాలని మీడియాను కోరారు.
ఇవి కూడా చదవండి:
‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?
‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!
మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!
System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ