పవర్ ఫుల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన టబు..
ABN, Publish Date - Nov 04 , 2026 | 04:29 PM
ఒకప్పటి సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ పాత్రలు ఉండేవి. ఉన్నాకొద్దీ అలాంటి పాత్రలు, అలాంటి సినిమాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆ తరువాత మళ్లీ డైరెక్టర్స్ మహిళా ప్రాధాన్యత పాత్రలను తీసుకొస్తున్నారు.
ఒకప్పటి సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ పాత్రలు ఉండేవి. ఉన్నాకొద్దీ అలాంటి పాత్రలు, అలాంటి సినిమాలు తగ్గిపోతూ వచ్చాయి. ఆ తరువాత మళ్లీ డైరెక్టర్స్ మహిళా ప్రాధాన్యత పాత్రలను తీసుకొస్తున్నారు. నదియా, రమ్యకృష్ణ, లాంటి వారు తెలుగులో మంచి పవర్ ఫుల్ రోల్స్ లో కనిపించి ఇండస్ట్రీని షేక్ చేశారు. ఈమధ్యకాలంలో వారు కూడా ఎక్కువ కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం పవర్ ఫుల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది బాలీవుడ్ బ్యూటీ టబు (Tabu). కూలీ నెంబర్ 1 సినిమాతో టబు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే.. ఈ చిన్నది నార్త్ కి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.
ఇక అక్కడే ఉండకుండా టబు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల.. వైకుంఠపురంలో సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రజెంట్ ఆమె నటిస్తున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న, తన వయస్సుకు తగిన వైవిధ్యమైన రోల్స్‌ను ఎంచుకుంటూ టబు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే టబు.. స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ చిత్రంలో టబు గౌరీ హెగ్డే అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది. డిఫరెంట్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో టబు నటన ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ట్రేడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.
స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ కాకుండా టబు నటిస్తోన్న మరో చిత్రం కింగ్ 100. అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక మైల్‌స్టోన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టబు మహంతి ఝాన్సీ రాణి అనే శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. టబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌లో ఆమె లుక్, హుందాతనం, వాయిస్ ఓవర్ హైలైట్‌గా నిలిచాయి. విధిని నమ్మకుండా ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగే రాజకీయ నాయకురాలిగా ఆమె అంచనాలను తలకిందులు చేసేలా కనిపిస్తుంది. గతంలో రొమాంటిక్ జోడీగా అలరించిన నాగార్జున - టబు జంట, ఈ చిత్రంలో ప్రేమికులుగా కాకుండా సరికొత్త పాత్రల్లో ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఈమధ్యకాలంలో ఏ సీనియర్ హీరోయిన్ కి ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ పడలేదనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాన్ని అందుకుంటే.. తెలుగులో టబుకి ఇలాంటి పాత్రలు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.
ఇవి కూడా చదవండి:
నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్
సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే
దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు