Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’
ABN, Publish Date - Oct 09 , 2026 | 10:54 AM
కోలీవుడ్ స్టార్ సూర్య, టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా.. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సీన్’. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya), టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోహీరోయిన్లుగా.. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్ (Jithu Madhavan)తో దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సీన్’ (Scene). ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపైలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి.. సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ మ్యూజికల్ జర్నీని మేకర్స్ స్టార్ట్ చేశారు.
అందులో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’ (Ammo Idi Evarra) అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఫుట్‌ట్యాపింగ్ బీట్స్, ఆకట్టుకునే రిథమ్‌తో అదిరిపోయే ఎనర్జీని అందిస్తోంది. పాటలోని వైబ్రెంట్ మూడ్‌కు తగ్గట్టుగా ఈ అప్‌బీట్ కంపోజిషన్ ఆకట్టుకుంటోంది. రాకేందు మౌళి అందించిన లిరిక్స్... నజ్రియా పాత్రలోని అగ్రెసివ్, ఎనర్జిటిక్ నేచర్‌ను తెలియజేస్తున్నాయి. సింగర్ వినాయక్ తన లైవ్లీ, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీని ఇచ్చారని చెప్పుకోవచ్చు.
వీడియో గేమ్ కాన్సెప్ట్ చుట్టూ ఈ పాటను క్రియేట్ చేసిన తీరు ఆకర్షిస్తోంది. కొరియోగ్రాఫర్ రాజ్ ప్రియన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ యూనిక్ ఐడియా.. పాటకు ప్లేఫుల్ టచ్‌ను తీసుకొచ్చింది. ఫన్, క్విర్కీ ఎలిమెంట్స్‌తో పాటను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా నజ్రియా పాటంతా ఫుల్ ఎనర్జీ, ఉత్సాహంతో కనిపించారు. ‘అమ్మో ఇది ఎవర్రా’ పాట అదిరిపోయేలా ఉండటంతో ‘సీన్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఇది మంచి ఆరంభమని చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో దూసుకెళుతోన్న సూర్యకు ఈ చిత్రం కూడా మంచి సక్సెస్‌ని ఇస్తుందనేలా.. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ హామీ ఇస్తుండటంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్
కిలికిని మించి.. ‘వారణాసి’ కోసం జక్కన్న ‘బాహుబలి’ స్ట్రాటజీ!
రాజ్యసభ వైపు రజనీకాంత్ వైఫ్ లత అడుగులు..!