కిలికిని మించి.. ‘వారణాసి’ కోసం జక్కన్న ‘బాహుబలి’ స్ట్రాటజీ!

ABN , Publish Date - Oct 08 , 2026 | 09:54 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Varanasi Movie New Update

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (Varanasi) రిలీజ్‌కు ముందే భారీ సంచలనాలను సృష్టిస్తుంది. భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి ప్రేక్షకుల వరకు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమా ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తా చాటి, RRRతో ఆస్కార్ వేదికపై మన జెండా పాతిన రాజమౌళి.. ఈసారి అంతకుమించి అన్న రేంజ్‌లో బిగ్ స్క్రీన్‌పై ఒక విజువల్ వండర్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు.


సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే కథ, కథనాలు, విజువల్స్ పీక్స్‌లో ఉంటాయి. అయితే ‘వారణాసి’ విషయంలో ఆయన విజన్ పూర్తిగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. గ్లోబ్ ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, లొకేషన్స్.. ఇలా ప్రతి అంశంలోనూ బాహుబలి, RRRల రికార్డులను బ్రేక్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబును స్క్రీన్‌పై మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో, పూర్తి ఇంటెన్స్ అడ్వెంచరర్‌గా ప్రెజెంట్ చేయడానికి గ్రౌండ్ వర్క్ ఇప్పటికే ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఫిలిం నగర్ వర్గాల్లో ఒక అదిరిపోయే న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

వారణాసి సినిమా కోసం మేకర్స్ ఒక ప్రత్యేకమైన కొత్త భాషను సృష్టించారనే వార్త సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. గతంలో బాహుబలి సినిమాలో కాలకేయ పాత్రల కోసం ‘కిలికి’ అనే వినూత్న భాషను సృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ భాష ఎంతటి సెన్సేషన్ క్రియేట్ తెలియంది కాదు. ఇప్పుడు ‘వారణాసి’లో రాబోయే కొన్ని కీలకమైన సీక్వెన్స్‌లు, పురాతన తెగలు లేదా ప్రత్యేక సన్నివేశాల నేటివిటీ కోసం మరో కొత్త లిపిని, భాషను సిద్ధం చేశారట. సినిమా మూడ్‌ను మరింత సహజంగా, థ్రిల్లింగ్‌గా మార్చేందుకు ఈ ప్రయోగం చేయబోతున్నారని టాక్.


కేవలం భారీ విజువల్స్ మాత్రమే కాదు.. ఇలాంటి సరికొత్త ప్రయోగాలు జోడించడం వల్ల సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కు ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఒక కొత్త సంస్కృతి, విలక్షణమైన డైలాగ్స్, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసి ‘వారణాసి’ని ప్రపంచ వేదికపై ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టబోతున్నాయి. అడ్వెంచర్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది వెండితెరపై కనీవినీ ఎరుగని దృశ్య విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త లిపి, బాషకు సంబంధించి టీమ్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. మొత్తంగా అయితే.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాలను సృష్టిస్తుందో తెలియాలంటే మాత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

రాజ్యసభ వైపు రజనీకాంత్ వైఫ్ లత అడుగులు..!

హానెస్టీ ‘అహంకారం’గా.. ఆత్మవిశ్వాసం ‘బలుపు’గా అనిపిస్తే.. నేను తగ్గాలా?: విజయ్ దేవరకొండ

Ranabaali Trailer: పుట్టపర్తి నడిరోడ్డుపై పండబెట్టి నీ జాతిని నరుకుతా.. విజయ్ విశ్వరూపం

Updated Date - Oct 08 , 2026 | 09:54 PM