సూర్య అరుదైన రికార్డ్‌.. ఒకే ఏడాది మూడు రూ. 200 కోట్ల సినిమాలతో సరికొత్త చరిత్ర!

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:04 PM

తమిళ స్టార్ హీరో సూర్య 2026లో అరుదైన బాక్సాఫీస్ రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నారు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాల తర్వాత సీన్ సినిమా కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. మూడు సినిమాలతో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సౌత్ హీరోగా సూర్య నిలవనున్నారా?

Suriya Scene Movie

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఓ రేర్ రికార్డ్ ను సొంతం చేసుకోబోతున్నాడు. ఒకే సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్‌ హిట్స్ తో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన వారు ఇప్పటి వరకూ సౌత్‌లో ఎవరూ లేరు. ఉత్తరాదిన ఈ ఫీట్‌ను అక్షయ్‌ కుమార్, షారూఖ్‌ ఖాన్ ఇప్పటికే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి సరసన సూర్య చేరబోతున్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ యేడాదికి ఐదారు సినిమాలలో నటిస్తూ ఉంటారు. భారీ బడ్జెట్‌ చిత్రాలనే కాకుండా మీడియం బడ్జెట్‌ మూవీస్‌లోనూ నటిస్తుంటారు. 2019లో అక్షయ్‌ కుమార్‌ నటించిన 'మిషల్‌ మంగళ్‌, హౌస్‌ ఫుల్‌ 4, గుడ్ న్యూజ్‌' చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలు రూ. 200 కోట్ల గ్రాస్‌ను సాధించి, ఒకే యేడాది వరుసగా ఈ విజయాన్ని అందుకున్న హీరోగా అక్షయ్‌ కుమార్‌ను నిలిపాయి.


మళ్ళీ అలాంటి రేర్‌ ఫీట్‌ను షారూఖ్‌ ఖాన్ 2023లో సాధించాడు. అతను నటించిన 'పఠాన్‌, జవాన్‌, డంకీ' చిత్రాలు ఒకే సంవత్సరంలో విడుదలై అన్నీ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్‌ను వసులూ చేసి రికార్డ్ సృష్టించాయి. ఇప్పుడు ఆ రేర్‌ ఫీట్‌ను 2026లో తమిళ హీరో సూర్య సాధించాడు.

ఈ యేడాది సూర్య నటించిన 'కరుప్పు' సినిమా రూ. 350 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, ఆ తర్వాత వచ్చిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' రూ. 200 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన సూర్య 'సీన్‌' తొలి ఐదు రోజులకు దాదాపు రూ. 175 కోట్ల గ్రాస్‌ను వసులూ చేసింది. రాబోయే తొమ్మిది రోజుల్లో తమిళంలో చెప్పుకోదగ్గ చిత్రమేదీ విడుదల కావడం లేదు. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా రూ. 250 నుంచి 300 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసే ఆస్కారం ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రకంగా ఒకే యేడాది ఇలా రూ. 200 కోట్లకు పైగా మూడు చిత్రాలను బ్యాక్‌ టూ బ్యాక్‌ ఇచ్చిన సౌతిండియన్‌ హీరోగా సూర్య సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.

ఇవి కూడా చదవండి:

పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి భామ.. వరుడు ఎవరంటే

రామాయణం ప్రభంజనం.. రికార్డులన్నీ బద్దలు

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

Updated Date - Nov 11 , 2026 | 12:09 PM