పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి భామ.. వరుడు ఎవరంటే

ABN , Publish Date - Nov 10 , 2026 | 08:34 PM

ఈ ఏడాది చివర్లో ఇండస్ట్రీ పెళ్లి వేడుకలతో కళకళలాడుతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్స్ ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి.

Priya Bhavani Shankar

ఈ ఏడాది చివర్లో ఇండస్ట్రీ పెళ్లి వేడుకలతో కళకళలాడుతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా స్టార్స్ ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో సాయి దుర్గా తేజ్, తేజ సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ లాంటి స్టార్స్ అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక కోలీవుడ్ లో నేడు అనిరుధ్- కావ్య మారన్ పెళ్లి జరుగుతుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి చేరింది అందాల భామ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar).


ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని ఏళ్ళకే అమ్మడు ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమన్నాయి. తన కాలేజీ రోజులనుంచే రాజ్‌వేల్ రాజ్‌తో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ప్రియా.. ఎట్టకేలకు ఆ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లింది. నేడు వీరి ఎంగేజ్ మెంట్ అత్యంత సన్నహితుల మధ్య ఘనంగా జరిగింది. రంగుల ప్రపంచంలో ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా పంచుకునే ప్రియ.. తన ప్రియుడిని గతంలోనే అభిమానులకు పరిచయం చేసింది. వీరిద్దరూ కలిసి పెళ్ళికి ముందే ఒక ఇల్లుని కూడా కొనుగోలు చేశారు. నిత్యం వీరిద్దరూ కలిసి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇన్నాళ్లకు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.


తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన కూడా.. ఇరుముడితోనే ఆమె ఒక మంచి సక్సెస్ ని అందుకుంది ప్రియా భవానీ శంకర్. మాస్ మహారాజా రవితేజ- శివ నిర్వాణ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కావేరి పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె చేతిలో డిమోంటే కాలనీ 3, మరగద నాణెం 2, కమల్ హాసన్ ఇండియన్ 3 వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఆమె సిద్ధమవడంతో కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఈ పెళ్లి వేడుక ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 10 , 2026 | 08:34 PM