రామాయణం ప్రభంజనం.. రికార్డులన్నీ బద్దలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 03:57 PM

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన రామాయణం ఫస్ట్ మండే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

Ramayana

సాధారణంగా ఏ సినిమాకైనా తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు తగ్గుతుంటాయి. ముఖ్యంగా ఆదివారం, దీపావళి వంటి పండుగ సెలవులు ముగిసి సోమవారం వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర సందడి కొంత తగ్గడం సహజం. కానీ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యష్ (Yash) ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణం’ (Ramayana Movie) మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ త‌ర్వాత నెగిటివ్ రివ్యూలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫస్ట్ మండే కలెక్షన్లతోనే గతంలో పలు భారీ చిత్రాలు నెలకొల్పిన రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) పేరిట ఉన్న రికార్డులను అధిగమిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

దీపావళి వసూళ్లలో టైగర్ 3 రికార్డు బద్దలు

దీపావళి నాడు ఆదివారం ఒక్కరోజే రామాయణం భారత్‌లో రూ.56.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో 2023లో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 దీపావళి రోజున సాధించిన రూ.44.50 కోట్ల రికార్డు వెనక్కి వెళ్లింది. బాలీవుడ్‌లో దీపావళి రోజున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రామాయణం నిలిచింది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కుకు చేరువైనట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక‌.. ఫస్ట్ మండే వసూళ్ల విషయంలో ‘ధురంధర్ 2’ నెలకొల్పిన రికార్డును ‘రామాయణం’ ఇప్ప‌టికే అధిగమించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ధురంధర్ 2 తొలి సోమవారం రూ.60 కోట్ల వసూళ్లు సాధించగా, రామాయణం అంతకంటే రెట్టింపు స్థాయిలో వసూళ్లు సాధించింది. అమెరికా మార్కెట్‌లోనూ ఈ సినిమా జోరు కొనసాగుతోంది. అక్కడ సోమవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ 2 పేరిట ఉన్న 1.138 మిలియన్ డాలర్ల రికార్డును రామాయణం అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. సోమవారం ఉదయం 8 గంటల సమయానికే 600 వేల డాలర్ల మార్కును దాటడం విశేషం.

బుక్‌మైషోలోనూ ఆల్‌టైమ్ రికార్డు

ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లోనూ రామాయణం తన సత్తా చాటుతోంది. బుక్‌మైషోలో ఒక గంట వ్యవధిలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రాల రికార్డును ఈ సినిమా అధిగమించింది. ధురంధర్ 2 గంటకు 1.09 లక్షల టికెట్లు విక్రయించగా, పుష్ప 2 పేరిట ఉన్న 1.07 లక్షల టికెట్ల రికార్డును కూడా రామాయణం వెనక్కి నెట్టింది. సోమవారం సాయంత్రం ఒక దశలో గంట వ్యవధిలోనే 1.31 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఇక గత 24 గంటల్లో బుక్‌మైషో ద్వారా ఏకంగా 16.6 లక్షల టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ రేంజ్‌లో ఉందో తెలియజేస్తోంది.

Updated Date - Nov 10 , 2026 | 03:57 PM