పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:51 PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- అన్నా కొణిదెల పరస్పరంగా విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ వార్త తెల్సినప్పటి నుంచి సోషల్ మీడియాలోచాలామంది పవన్ పై ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)- అన్నా కొణిదెల పరస్పరంగా విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ వార్త తెల్సినప్పటి నుంచి సోషల్ మీడియాలోచాలామంది పవన్ పై ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు. పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని, విడిపోవడం, ఇప్పుడు మళ్లీ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంలో మాట్లాడిన వీడియోస్ ని పోస్ట్ చేస్తూ.. మంచి భార్యలను వదులుకున్నారని రాసుకొస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో రచ్చ జరుగుతున్న తరుణంలో రేణు దేశాయ్ (Renu Desai) చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. వ్యక్తిగత కష్టాల్లో ఉన్నవారిపై నెటిజన్లు, ట్రోలర్లు విమర్శలు గుప్పించడాన్ని నిరసిస్తూ ఆమె పెట్టిన సుదీర్ఘ సందేశం ప్రస్తుతం టాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తన పోస్ట్‌లో రేణు దేశాయ్ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. 'ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు వారిని ఇంకా దూషించడం నైతికంగా సరికాదు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని తొక్కడం అమానుషం. వారు ఏ స్థాయిలో ఉన్నా, వారు కూడా ఒక మనిషే.. ఒకరి సంతానం, ఒకరి తల్లిదండ్రి లేదా సోదరీసోదరులు అని మరచిపోకూడదు. మనమే అపూర్ణమైన గాజు మేడల్లో జీవిస్తున్నప్పుడు, ఇతరుల ఇళ్లపై రాళ్లు విసిరే ప్రయత్నం చేయకండి. మనమంతా మనుషులమే.. మనుషులుగా అనిపించుకోవడానికి సహానుభూతి, దయ మొదటి ప్రాథమిక అవసరాలు' అంటూ రాసుకొచ్చింది.
అంతే కాకుండా 'నేను ఈ మాటలు రాసినంత మాత్రాన మీ పిచ్చి ఊహాగానాలు మొదలుపెట్టకండి.. సమాజంగా మనం ఇంకా మెరుగ్గా ప్రవర్తించగలమని నమ్మి మాత్రమే ఇది రాశాను. దయ, విచక్షణతో మాట్లాడటానికి నాకు ఎవరి నుంచి పేటీఎం రాలేదు, నా బ్రెయిన్‌తో ఆలోచించి చెబుతున్నాను' అని తెలిపింది. ఆమె ఎంత వివరణ ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ పోస్ట్ రావడంతో ఇది ఆయనను ఉద్దేశించి చేసిందేనని నెటిజన్లు గట్టిగా చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా ఈ సమయంలో రేణు ఇలాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా మంచి విషయమని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.