కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' గ్లింప్స్.. మళ్లీ బంపర్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:42 AM
యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం మరోమారు మెగాఫోన్ చేతబట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం KA13 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే.
యంగ్ స్టార్ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మరోమారు మెగాఫోన్ చేతబట్టి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం KA13 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సోమవారం అధికారికంగా కీలక అప్డేట్ ఇచ్చారు. తొలినుంచే రియాలిటీ అనే పేరు చలామణిలో ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్స్ శరత్ కుమార్ (Sarath Kumar), సాయి కుమార్ (Sai Kumar), రోహిణి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. దేవిక బట్ (Devika Bhatt) కథానాయికగా నటిస్తుండగా భీమ్స్ (Bheems Ceciroleo ) సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు రియాలిటీ (Reality) పేరునే ఖరారు చేయడంతో పాటు ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో విడుదల చేసిన గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉంది. ఓ చిన్న భోజన హోటల్ నడుపుకునే అనందం స్వయంగా వంటలు చేయడం, అందరికీ ఆకులు వేసి వడ్డిస్తూ ముఖంపై నవ్వుతో సరదాగా ఉండడాన్ని చూపించారు.
ఈ సందర్భంగా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ప్రతోడిలో ఓ హై మూమెంట్ ఉంటుంది మామ నా లైఫ్‌లో ఈ రోజు హై మూమెంట్.ఈ రోజుతో నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఒక్క రూపాయి అప్పు లేదు ఇంతకన్నా హై మూమెంట్ ఏముంటది? అంటూ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా హృద్యంగా ఉంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా కిరణ్‌కు మళ్లీ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. మీరూ ఈ గ్లింప్స్‌పై ఓ లుక్ వేయండి.