సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Supriya: క్యూట్ అండ్ డీప్ ఎమోషన్ తో 'పళ్ళ బురుసు'

ABN, Publish Date - Aug 11 , 2026 | 09:58 AM

'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే  ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్  డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది.

'కుటుంబ పెద్దలే మన ఫౌండేషన్. వాళ్ళే మన బలం' అనే  ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. క్యూట్ అండ్  డీప్ ఎమోషన్ తో కూడిన సందేశం ఈ సినిమా ఇవ్వబోతుంది. మా  తాత ఏఎన్నార్ ఉండుంటే.. మంచి సినిమా చేశావని ప్రశంసించేవారు' అని సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన ‘పళ్ళ బురుసు’  చిత్రం  విడుదలకు సిద్ధమైంది. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, ప్రజ్వల్‌, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రీరిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించింది.

సుప్రియ మాట్లాడుతూ 'అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై ‘పళ్ళ బురుసు’ వంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు  చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించాం. సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఈరోజు ఉండి ఉంటే.. ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నన్ను తప్పకుండా అభినందించేవారు. ఆయన ఆశయాలు, విలువలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది' అని అన్నారు. 

ALSO READ:

Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి

శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా..  వర్కవుట్ అవుతుందా?'

Ranabaali: ‘రణబాలి’  విడుదల తేదీ ఖాయమైనట్టేనా? 


Updated Date - Aug 11 , 2026 | 11:17 AM