Summer Holidays: పిల్లల సినిమాలో క్రష్ సాంగ్!
ABN, Publish Date - Jul 01 , 2026 | 05:55 PM
ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించిన సినిమా 'సమ్మర్ హాలిడేస్'. ఈ సినిమా నుంచి క్రష్ సాంగ్ తాజాగా విడుదలైంది.
కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఉత్సాహం చూపించే ధీరజ్ మొగిలినేనికి పంపిణీదారుడిగానూ మంచి అనుభవం ఉంది. ఇప్పుడాయన 'సమ్మర్ హాలిడేస్' పేరుతో ఓ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి క్రష్ సాంగ్‌ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్. చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.
ఈ సందర్భంగా రచయిత కొండల్ రావు మాట్లాడుతూ, 'ఈ సినిమాకు ఆరు నెలలు వర్క్ చేశాం. ఆ ఆరు నెలలు ఎలా గడిచిపోయాయో తెలియదు. అంత హ్యాపీగా టీమ్ అంతా ఈ మూవీకి పనిచేశాం. రీసెంట్ గా టీజర్ రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు క్రష్ సాంగ్ పెద్ద హిట్ అవుతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాం' అని అన్నారు. గీత రచయిత కిట్టూ విస్సాప్రగడ మాట్లాడుతూ, 'కొన్ని పాటలు మన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. కానీ ఈ పాట మన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ అంత బాగా ఈ పాటను కంపోజ్ చేశారు. మీకు నచ్చిన వారికి ఈ పాట షేర్ చేసి వారితో కలిసి ఈ పాట వినమని రిక్వెస్ట్ చేస్తున్నాను' అని అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, 'శ్రీకర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక మంచి మూవీ చేశామని మీ అందరితో అనిపించుకుంటాం. సింజిత్ మ్యూజిక్ చేయకుంటే ఈ పాటలు ఇంత బాగా వచ్చేవి కావేమో. ఆయన మూడు పాటలు ఛాట్ బస్టర్స్ ఇచ్చారు. కిట్టు విస్సాప్రగడ గతంలో మా సినిమాలకు వర్క్ చేశారు. ఈ పాటను అందంగా రాశారు. 800 పాటలు పాడిన అనురాగ్ కులకర్ణి గారు అంతే ప్యాషనేట్ గా ఈ పాట పాడారు. మేము కథను నమ్మే ఇంత ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నాం. 90 మిడిల్ క్లాస్ రూపొందించిన ఆదిత్య హాసన్, అప్పుడు రోహన్ క్యారెక్టర్ ను ఇప్పుడు ఎపిక్ మూవీలో చేస్తున్న ఆనంద్ దేవరకొండ..వీళ్లిద్దరి చేతుల మీదుగానే ఈ క్రష్ సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ అనిపించింది. ఆనంద్ గారితో దొరసాని, బేబి మూవీస్ చేశాం. మా కాంబోలో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. గీతా ఆర్ట్స్ తో మా అనుబంధం ఎలా కొనసాగుతుందో ఎస్ కేఎన్ తోనూ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎగ్జామ్స్ ఉన్నా, స్కూల్స్ జరుగుతున్నా రోహన్, ఖుషి, అరుణ్ ను షూటింగ్ ఉన్నప్పుడు పంపి సపోర్ట్ చేసిన వాళ్ల పేరెంట్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్ల సపోర్ట్ లేకుండా షూటింగ్ పూర్తయ్యేది కాదు. హైదరాబాద్ , అమలాపురం..ఇలా మల్టిపుల్ లొకేషన్స్ కు తరుచూ వెళ్లి షూటింగ్ చేశాం' అని అన్నారు.
ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడారని, ఈ పాటలాగానే మిగిలిన పాటలు చాలా బాగా వచ్చాయని నిర్మాత గిరిబాబు వల్లభనేని తెలిపారు. ఈ పాట పాడేప్పుడు తన బాల్యం నాటి అనుభవాలు గుర్తొచ్చాయని అనురాగ్ కులకర్ణి చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ రోహన్ రాయ్, బేబీ ఖుషి, కొరియోగ్రాఫర్ లక్ష్మణ్, సంగీత దర్శకుడు సింజిత్, దర్శకుడు శ్రీకర్ కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారంతా సినిమా మంచి విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
‘కాగితం పడవలు’ చిత్రబృందం చేసిన పనికి చిరు ఫిదా.. ఏం చేశారంటే
Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?
సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట