Spider - Man : షాకింగ్ రెమ్యూనరేషన్... మెస్సీ నా మజాకా!?

ABN , Publish Date - Jul 01 , 2026 | 01:20 PM

స్పైడర్ మ్యాన్ తాజా ప్రోమోలో ప్రపంచ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ కనిపించి కనువిందు చేశాడు. అయితే అతను తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.

Spider Man Movie

టామ్ హోలాండ్, జెండాయ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూలై 31న విడుదల కాబోతుంటే... భారత్‌లో ఒకరోజు ముందే 30న రిలీజ్ అవుతోంది. ఇటీవల విడుదలైన 'స్పైడర్ మ్యాన్' మూవీ ప్రోమోలో వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్‌ ఆటగాడు మెస్సీ నటించారు. ఆయన అందులో కేవలం 20 సెకన్లు మాత్రమే కనిపించారు. అయితే అందుకోసం అందుకున్న పారితోషికం మాత్రం భారీగా ఉంది. ఈ ప్రోమోలో నటించేందుకు మెస్సీ ఏకంగా 15 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 140 కోట్లకు సమానం. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్ ఫుట్ బాల్‌ ఛాంపియన్ షిప్ లో మెస్సీ కూడా ఫేమస్ ప్లేయర్ కాబట్టి... ఎంత మొత్తం ఇచ్చినా తప్పులేదని కొందరు అంటున్నారు. మెస్సీ కారణంగా వరల్డ్ వైడ్ 'స్పైడర్ మ్యాన్' మూవీకి క్రేజ్ పెరుగుతుందని, కాబట్టి రెమ్యూనరేషన్ ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదని వాదిస్తున్నారు. అయితే... పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు చేసినా... సినిమా కథలో దమ్ము ఉంటేనే ఆడుతుందనేది వాస్తవం. పైగా 'స్పైడర్ మ్యాన్' కంటూ కొన్ని దశాబ్దాలుగా స్ట్రాంగ్‌ ఫ్యాన్స్ ఉన్నారు. వారిని మెప్పించే విధంగా ఈ లేటెస్ట్ మూవీ ఉంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:

Akhil Akkineni: నన్ను క్షమించండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్

హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా

Updated Date - Jul 01 , 2026 | 01:30 PM