సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘సమ్మర్ హాలిడేస్’లో రోహన్ ఏం చేస్తున్నాడో చూశారా!

ABN, Publish Date - May 16 , 2026 | 04:01 PM

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు ధీరజ్ మొగిలినేని. తాజాగా ఆయన నిర్మిస్తోన్న ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ విడుదలైంది.

Master Rohan Roy in Summer Holidays Movie

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పొందారు ధీరజ్ మొగిలినేని. కథా బలమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, ఆయన తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ (Dheeraj Mogilineni Entertainments) బ్యానర్ పై ఓ చిల్డ్రన్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘సమ్మర్ హాలిడేస్’ (Summer Holidays) పేరుతో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాను అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్ రాయ్ (Master Rohan Roy), మాస్టర్ అరుణ్ (Master Arun) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను వదిలారు.


ఈ సినిమాలో నటిస్తోన్న బాల నటుడు రోహన్ పుట్టినరోజు నేడు (మే 16). రోహన్ బర్త్‌డే‌ని పురస్కరించుకుని ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవల వచ్చిన ‘90’s మిడిల్ క్లాస్ బయోపిక్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాల్లో నటించి బాల నటుడిగా రోహన్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌లో సమ్మర్‌లో పిల్లలందరూ చేసే పనే రోహన్ చేస్తున్నారు. ఈ మధ్య పిల్లలందరి చేతుల్లో కామన్‌గా కనిపించే క్రికెట్ బ్యాట్‌తో ఇందులో రోహన్ పరుగులు తీస్తున్నారు. ఫేస్‌లో నవ్వు చూస్తుంటే.. గేమ్‌లో విన్ అయినట్లుగా అనిపిస్తోంది. మొత్తంగా అయితే ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరో బాల నటుడు మాస్టర్ అరుణ్ ఇటీవల వచ్చిన ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో మంచి ఫేమస్ అయ్యారు. వీళ్లిద్దరికీ ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం మరింత పేరు తీసుకురానుందని, త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నామని మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుందని టీమ్ తెలుపుతోంది.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Updated Date - May 16 , 2026 | 04:01 PM