సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

48 ఏళ్ళ సినీ ప్రస్థానానికి ఘన సత్కారం

ABN, Publish Date - Nov 17 , 2026 | 04:09 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్‌కు ప్రతిష్టాత్మక కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం లభించింది. 48 ఏళ్ల సినీ ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుడు సుమన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన అందించిన సుదీర్ఘ సేవలకు గాను 'కత్తి కాంతారావు జాతీయ పురస్కారం' లభించింది. తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా అందజేసే 'కళా ప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం' ఈ ఏడాది సుమన్‌ను వరించింది. ఈ సెలక్షన్ కమిటీకి కె.వి. రమణాచారి ఛైర్మన్‌గా వ్యవహరించగా సి. పార్థసారథి, నాగబాల డి. సురేష్ కుమార్ కో-ఛైర్మన్లుగా ఉన్నారు. దాదాపు 300కు పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించిన సుమన్‌కు ఈ అవార్డును నవంబర్ 16న అందచేశారు.


ఈ కార్యక్రమంలో 'నాగబాల' డి. సురేష్ కుమార్, సి. పార్థసారథి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, నటుడు బాబుమోహన్ తదితరులు పాల్గొన్నారు. సుమన్ కేవలం హీరో మాత్రమే కాదనీ... పౌరాణిక పాత్రల్లో శ్రీవేంకటేశ్వర స్వామిగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించారని గుర్తు చేశారు. ఒక వైపు యాక్షన్ హీరోగా, కరాటే యోధుడిగా, మరోవైపు విభిన్న పాత్రలతో మూసధోరణి సినిమాలకు భిన్నంగా నవ్యతను తీసుకొచ్చిన సుమన్‌ను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరోవైపు హైదరాబాద్‌ సినిమా, టీవీ సీరియల్ షూటింగ్‌లకు పెద్ద హబ్‌గా మారిందని ఇతర భాషల చిత్రాల నిర్మాతలు కూడా ఇక్కడికి వస్తున్నారని సి. పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం సినిమా రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. మరోవైపు సుమన్ ఏ పాత్రనైనా అవలీలగా చేయగల సమర్థుడని, 'శివాజీ' చిత్రంలో విలన్‌గా కొత్తదనాన్ని చూపించాడని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి ప్రశంసించారు. టీవీ రంగంలో పనిచేస్తున్న నటీనటులకు కూడా ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. నటుడు బాబుమోహన్ తనదైన శైలిలో సుమన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన మంచి నటుడే కాక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.

ఇదిలా ఉంటే అవార్డు అందుకున్న సుమన్ కాంతారావు జాతీయ అవార్డ్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయిందని, వెయ్యికి పైగా సినిమాల్లో నటించానని తెలిపారు. కాంతారావు గతంలో తనకు చెప్పిన మంచి సలహా వల్లే తాను నిర్మాణ రంగంలోకి వెళ్ళలేదని, ఇన్నాళ్ళుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకుల అభిమానమే ఈ పురస్కారానికి అసలైన బలమని భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ వేడుకలో సుమన్‌తో పాటు నటి కవిత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితర ప్రముఖులు కూడా ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

మిడ్‌నైట్ అప్డేట్స్.. జక్కన్నా నీ స్ట్రాటజీని అందుకోవడం కష్టమే..

James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్‌.. అదిరిపోయాడు

అనిరుధ్ స్వరాలకు..15 వసంతాలు

Updated Date - Nov 17 , 2026 | 04:09 PM