ఎట్టకేలకు జనం ముందుకు 'గోట్‌'!

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:23 PM

సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన చిత్రం 'గోట్‌'. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా నవంబర్ 12న జనం ముందుకు రాబోతోంది.

Goat Movie

ఇది విజయ్‌ నటించిన తమిళ సినిమా 'గోట్‌' కాదు. అది రెండేళ్ళ క్రితమే తమిళ, తెలుగు భాషల్లో వచ్చేసింది. అయితే అదే సమయంలో 'జబర్దస్త్' ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ నటించిన 'గోట్‌' సినిమా ఇది. తమిళ నటి దివ్యభారతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మించారు. ఈ సినిమాకు తొలుత నరేశ్‌ కుప్పిలి దర్శకుడు. అయితే దర్శక నిర్మాతల మధ్య స్పర్థలు రావడంతో నరేశ్‌ కుప్పిలి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో వేదవ్యాస్‌ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమా తొలి కాపీని తీసుకొచ్చారు. ఈ యేడాది ప్రారంభంలోనే సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, మార్చిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో కాలేదు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు డేట్స్ అనౌన్స్ చేశారు కానీ అప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాను నవంబర్‌ 12న పక్కాగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న 'గోట్‌' పాటలకు మంచి స్పందన లభిస్తోంది.


ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ, 'సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంది. అది అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. సర్వదమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, 'ఆడుకాలం' నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

Radhika Sarathkumar: రివ్యూల పేరుతో హద్దులు దాటుతున్నారు.. సోషల్ మీడియా తీరుపై రాధిక శరత్‌కుమార్ ఫైర్

ఇరుముడి గ్లోబల్ రికార్డ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మాస్ మహారాజా

Sandeep Kishan: ఇండియన్‌ సెల్యులాయిడ్‌పై సరికొత్త విజువల్‌ ట్రీట్‌

Updated Date - Oct 01 , 2026 | 01:24 PM