Sandeep Kishan: ఇండియన్‌ సెల్యులాయిడ్‌పై సరికొత్త విజువల్‌ ట్రీట్‌.

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:12 AM

జాసన్‌ సంజయ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ కుమారుడే అయినప్పటికీ తన ప్రతిభతో వ్యక్తిగత గుర్తింపు కోసం తపనపడే యంగ్‌ డైరెక్టర్‌ అని హీరో సందీప్‌ కిషన్‌ కొనియాడారు

Sundeep Kishan - Jason Sanjay

జాసన్‌ సంజయ్‌ (Jason Sanjay) ముఖ్యమంత్రి విజయ్‌ కుమారుడే అయినప్పటికీ తన ప్రతిభతో వ్యక్తిగత గుర్తింపు కోసం తపనపడే యంగ్‌ డైరెక్టర్‌ అని హీరో సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కొనియాడారు. సుభాస్కరన్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్‌ పతాకంపై జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన చిత్రం ‘సిగ్మా’ ఈ శుక్రవారం విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, నిర్మాత జీకేఎం తమిళ్‌ కుమరన్‌ చిత్ర బృందం పాల్గొంది. 

ఈ సందర్భంగా తమిళ్‌ కుమరన్‌ మాట్లాడుతూ ‘జాసన్‌ను తమ బ్యానరు ద్వారా లాంచ్‌ చేయడం గర్వంగా ఉంది. ప్రతిభావంతుడైన దర్శకుడు. ఆయన తాత ఒక దర్శకుడు, తండ్రి స్టార్‌ హీరో, ఇపుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ జాసన్‌లో గర్వం లేదు. సాధారణ వ్యక్తిలా ప్రతి ఒక్కరితో ఎంతో ప్రేమగా నడుచుకునే శాంతస్వభావి. లైకా ప్రొడక్షన్‌ బ్యానరులో చిత్రాలు నిర్మించడంలో చిన్న గ్యాప్‌ వచ్చింది. మున్ముందు మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’ అని వెల్లడించారు. 

హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ, ‘నేను ఎక్కువగా కొత్త దర్శకులతోనే కలిసి పనిచేశాను. వారితో వర్క్‌ చేయడం నేను ఎంజాయ్‌ చేస్తాను. తన వ్యక్తిగత ప్రతిభ నిరూపించుకుని, తనకంటే ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటపడే వ్యక్తి జాసన్‌ సంజయ్‌. ఈ సినిమాను అంతబాగా తెరకెక్కించారు. ఇండియన్‌ సెల్యులాయిడ్‌పై ఇప్పటివరకు మీరు చూడని విధంగా ఉంటుంది. ఈ మూవీలో ఒక ఐటమ్‌ సాంగ్‌ ఉంది. ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపుతుంది' అన్నారు. 

హీరోయిన్‌ ఫరియా మాట్లాడుతూ, ‘నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఒకటి రెండు తమిళ చిత్రాల్లో నటించాను. ఇపుడు జాసన్‌ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 07:57 AM