ఇరుముడి గ్లోబల్ రికార్డ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మాస్ మహారాజా
ABN , Publish Date - Sep 30 , 2026 | 09:55 PM
కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది ఇరుముడి సినిమా మరోసారి నిరూపించింది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే.
కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది ఇరుముడి (Irumudi) సినిమా మరోసారి నిరూపించింది. మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న రవితేజకు భారీ బ్లాక్ బస్టర్ ని అందించడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరేలా చేసింది. త్రినాథ్ గా రవితేజ నటనకు ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. ఇక మణమ్మగా నక్షత్ర అదరగొట్టేసింది.
థియేటర్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ఓటీటీలో కూడా ఇరుముడి రికార్డులు సృష్టిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా విజయదుందుభి మోగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన గ్లోబల్ స్ట్రీమింగ్ చార్ట్స్‌లో ఇరుముడి నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ఏకంగా వరల్డ్ వైడ్ నంబర్ 1 స్పాట్‌ను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఓటీటీలోకి వచ్చిన మొదటి 3 రోజుల్లోనే 3.4 మిలియన్ వ్యూస్ సాధించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 6.8 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది.
సాధారణంగా థియేటర్లలో పెద్ద హిట్టయిన సినిమాలు ఓటీటీలో అంతగా ఆదరణ పొందవనే సెంటిమెంట్‌ను ఇరుముడి తిరగరాసింది. రవితేజ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్, బేబీ నక్షత్ర సెంటిమెంట్, శివ నిర్వాణ వైవిధ్యభరితమైన కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటూ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ముందు ముందు ఇరుముడి ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.