GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

ABN , First Publish Date - 2023-08-21T17:55:50+05:30 IST

జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారాడు. ఇప్పటికే మూడు చిత్రాలలో హీరోగా నటించి తనదైన నటనతో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాల్గవ చిత్రం ‘గోట్’. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది
Sudigali Sudheer in GOAT

జబర్దస్త్ షో తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారాడు. ఇప్పటికే మూడు చిత్రాలలో హీరోగా నటించి తనదైన నటనతో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాల్గవ చిత్రం ‘గోట్’ (GOAT). ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (Greatest Of All Time) అనేది దీనికి అర్థం. దివ్య భారతి (Divya Bharathi) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర గ్లింప్స్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.


Sudigali.jpg

ఈ వీడియో గ్లింప్స్‌లో సుధీర్ ఒక చేత్తో క్రికెట్ బ్యాక్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నోట్లో నుంచి సిగరెట్ తీసి.. ఎవడ్రా నువ్వు.. జూక్ అంది అని సుధీర్ డైలాగ్ చెబుతున్న తీరు అతనిలోని మాస్‌ని ఎలివేట్ చేస్తోంది. అలాగే ఈ గ్లింప్స్‌కి లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఓ స్టార్ హీరోకి ఎలివేషన్ ఇచ్చినట్లుగా హైలెట్‌గా ఉంది. మాస్ ఎంటర్‌‌టైనర్‌‌గా.. ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందనే విషయం ఈ గ్లింప్స్‌తో తెలిసిపోతుంది. (Sudigali Sudheer Starring GOAT Glimpse)

Sudigali-Sudheer.jpg

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది. రెండు పాటలు చిత్రీకరణ కూడా పూర్తయింది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఆయన అభిమానులు సుధీర్ నుంచి ఎలాంటి సినిమా ఊహిస్తున్నారో.. అంతకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పగలము. తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. (Sudigali Sudheer Starring GOAT Update)


ఇవి కూడా చదవండి:

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

*Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?

***************************************

*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..

***************************************

*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు

****************************************

Updated Date - 2023-08-21T17:55:55+05:30 IST