GOAT Movie: ఒడియమ్మ.. సుడిగాలి సుధీర్ సినిమా సాంగ్స్ భలే ఉన్నాయే

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:41 PM

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో గోట్ (Goat) ఒకటి. ఈ సినిమాతో బ్యాచిలర్ తో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ దివ్యభారతి(Divyabharathi) టాలీవుడ్ కి పరిచయమవుతుంది.

Goat movie

GOAT Movie: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో గోట్ (Goat) ఒకటి. ఈ సినిమాతో బ్యాచిలర్ తో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ దివ్యభారతి(Divyabharathi) టాలీవుడ్ కి పరిచయమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను కూడా పెంచాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడుగా ఉండేవాడు. కాకపోతే నిర్మాత - డైరెక్టర్ మధ్య బడ్జెట్ విభేదాల వలన ఈ సినిమా ఆగిపోవడమే కాకుండా డైరెక్టర్ కూడా తప్పుకున్నాడు.

ఇక కొన్ని నెలలుగా ఆగిపోయిన ఈ సినిమా ఈ మధ్యనే మళ్లీ పట్టాలెక్కిందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. డైరెక్టర్ మిగిల్చినదాన్ని నిర్మాతనే ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నాడట. ఇక గోట్ షూటింగ్ కూడా పూర్తి అవ్వడంతో రిలీజ్ డేట్ త్వరలోనే చెప్పనున్నారు. సినిమా ఆగిపోయింది కానీ, ఇందులో నుంచి రిలీజైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిజి చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.

ఒడియమ్మ అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమో అదిరిపోయింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్.. దివ్యభారతి అందాన్ని పొగుడుటూ.. ఆమె ప్రేమలో పడిన సుధీర్ ఈ సాంగ్ పాడుతున్నట్లు తెలుస్తోంది. సురేష్ బనిశెట్టి లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి వాయిస్ తో ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. నవంబర్ 19 న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 18 , 2025 | 05:41 PM