స్టార్ హీరోస్ మూవీస్ ఐఎమ్‌డిబీ రేటింగ్స్.. ఆ సినిమానే టాప్

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:40 AM

థియేటర్స్‌లో సినిమాల రన్నింగ్ ఎలా ఉన్నా- సోషల్ మీడియాలో తమకు నచ్చిన చిత్రాలకు జై కొట్టే ఛాన్స్ ఉంది. అలా ఐ.ఎమ్.డి.బి. వేదికగా సినీ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్స్ మూవీస్‌ను టాప్‌లో నిలిపే ప్రయత్నం చేస్తూంటారు. ఆ లెక్కలపై ఓ లుక్కేద్దాం.

IMDB Top Rating Movies

థియేటర్స్‌లో సినిమాల రన్నింగ్ ఎలా ఉన్నా- సోషల్ మీడియాలో తమకు నచ్చిన చిత్రాలకు జై కొట్టే ఛాన్స్ ఉంది. అలా ఐ.ఎమ్.డి.బి. వేదికగా సినీ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్స్ మూవీస్‌ను టాప్‌లో నిలిపే ప్రయత్నం చేస్తూంటారు. ఆ లెక్కలపై ఓ లుక్కేద్దాం. నచ్చిన సినిమాను పదేపదే చూసే అభిమానులుంటారు. థియేటర్స్‌కు వెళ్ళి అదే పనిగా చూసే రోజులు పోయాయి.. ప్రస్తుతం చేతిలోనే సెల్ ఫోన్‌లో కోరిన సినిమా చూసుకొనే అవకాశం కలుగుతోంది. దీంతో తాము మెచ్చిన చిత్రాలకు ‘ఇంటర్నెట్ మూవీ డేటా బేస్’ (IMDB) వేదికలోకి వెళ్ళి రేటింగ్స్ ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. అలా హిందీ సినిమాల్లో టాప్ రేటింగ్ సాధించిన చిత్రమేదంటే ఆమిర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’. ఈ మూవీ 8.4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలచింది. ఆ తర్వాతి స్థానంలో ‘షోలే’ 8.2 పాయింట్స్‌తో ఉంది. ఆ పై వరుసగా షారుఖ్ ఖాన్ ‘స్వదేశ్’, హృతిక్ రోషన్ ‘జిందగీ న మిలేగీ దుబారా’, అక్షయ్ కుమార్ ‘హేరా ఫేరీ’, అజయ్ దేవగణ్ ‘దృశ్యం’, రణవీర్ సింగ్ ‘ధురంధర్’ ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ 8.2 రేటింగ్స్ సాధించాయి. మరి ఆర్డర్ వేరుగా ఉంది కదా అంటే ఎంత సమయంలో ఎన్ని పాయింట్స్ వచ్చాయో లెక్కించి మరీ స్థానాలు నిర్ణయిస్తారు. అలా ‘త్రీ ఇడియట్స్’ బాలీవుడ్ మూవీస్‌లో నంబర్ వన్‌గా నిలచింది.


సౌత్ మూవీస్ తీరు..

కోలీవుడ్ విషయానికి వస్తే సూర్య ‘జై భీమ్’ 8.7 పాయింట్స్‌తో టాప్‌లో నిలచింది. ఆ పై కమల్ హాసన్ ‘నాయకన్’ మూవీ 8.6 పాయింట్స్‌తో రెండో స్థానంలో, 8.5 పాయింట్స్‌తో రజనీకాంత్ ‘దళపతి’ మూడో స్థానంలోనూ నిలిచాయి. విక్రమ్ ‘అన్నియన్’, విజయ్ ‘కత్తి’, అజిత్ ‘వాలీ’, ధనుష్ ‘అసురన్’ అన్నీ 8.1 సగటుతో ఉన్నాయి. కన్నడ చిత్రసీమలో ఈ నాటికీ తానే నంబర్ వన్ అని నిరూపించుకుంటోంది శివరాజ్ కుమార్ నటించిన ‘ఓమ్’. ఈ మూవీ 8.9 పాయింట్స్‌తో అగ్రగామిగా ఉంది. మలయాళ సీమలో మోహన్ లాల్ ‘దృశ్యం’, మమ్ముట్టి ‘తనియావర్తనం’ రెండు చిత్రాలు 8.9 పాయింట్స్‌తోనే ఉండడం విశేషం.


తెలుగులో ‘రంగస్థలం’దే పైచేయి!

తెలుగు సినిమాల్లో రామ్ చరణ్ ‘రంగస్థలం’ 8.2 పాయింట్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. 8.2 పాయింట్స్‌తోనే ప్రభాస్ ‘బాహుబలి-2’ కూడా సాగుతోంది. అల్లు అర్జున్ ‘ఆర్య’ 8.1 పాయింట్స్‌తోనూ, మహేశ్ ‘వన్ నేనొక్కడినే’ 8 పాయింట్స్ తోనూ ఉండగా, ‘ట్రిపుల్ ఆర్‌’ 7.8 పాయింట్స్ సాధించగలిగింది. ఈ పాయింట్స్‌ను బట్టి తెలుస్తున్నదేంటి? బాక్సాఫీస్ రిజల్ట్‌తో పనిలేకుండా అభిమానులు తమకు నచ్చిన చిత్రాలకు రేటింగ్స్ ఇస్తూ సాగుతున్నారు. అందువల్ల బోల్తా కొట్టిన సినిమాలు సైతం ఎక్కువ పాయింట్స్ సాధిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ రేటింగ్స్‌తో వచ్చే లాభమేంటి అంటే తాము టిక్ పెట్టిన సినిమాలకు హై రేటింగ్స్ వస్తే ఫ్యాన్స్ ఆనందిస్తూ ఉంటారు. ఆ తీరున సాగే మరికొందరు అభిమానులు వేరే చిత్రాలకు రేటింగ్స్ ఇస్తూ సాగవచ్చు. అప్పుడు ఇక్కడ పేర్కొన్న మూవీస్ రేటింగ్స్‌లో మార్పూ కనిపించవచ్చు. రాబోయే రోజుల్లో ఏ సినిమాలు టాప్‌లో నిలుస్తాయో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కొట్టేస్తున్నారు.. అల్లు అరవింద్‌కు రాజమౌళి సలహా

తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?

ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే

Updated Date - Nov 28 , 2026 | 03:02 PM

IMDb: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాలివే..

Tollywood 'Tara' Juvvalu : టాలీవుడ్‌ ‘తారా’జువ్వలు

Rangasthalam in Japan: బొమ్మ అదిరింది.. దిమ్మతిరిగే కలెక్షన్లు

3 Idiots: రీ-రిలీజ్‌ కాదు... సీక్వెల్‌ మాత్రమే

Sholay: 'షోలే' ఓ మధుర జ్ఞాపకం: నందమూరి మోహనకృష్ణ