IMDb: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాలివే..

ABN , First Publish Date - 2022-12-14T16:59:56+05:30 IST

కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్స్ వెలవెలబోయాయి. సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపించలేదు. ఓటీటీలకే అంకితమైపోయారు. ఇటువంటి తరుణంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు అనేక సినిమాలు వచ్చాయి.

IMDb: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాలివే..

కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్స్ వెలవెలబోయాయి. సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడానికి ఆసక్తి చూపించలేదు. ఓటీటీలకే అంకితమైపోయారు. ఇటువంటి తరుణంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు అనేక సినిమాలు వచ్చాయి. భారీగా వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ తరహా సినిమాలతో పాటు ‘కాంతార’, ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ వంటి చిత్రాలు ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) (ది ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ఈ ఏడాది మోస్ట్ పాపులర్ టాప్ 10 మూవీస్ లిస్ట్‌‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో అనేక సౌత్ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ అంటేనే అందరికి గుర్తుకు వచ్చే బాలీవుడ్ నుంచి ఒక్క చిత్రం ‘ది కశ్మీర్ పైల్స్’ మాత్రమే స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ బడా సినిమా ‘బ్రహ్మాస్త్ర‌’ కు కూడా ఈ లిస్ట్‌లో స్థానం దక్కలేదు.

1. ఆర్ఆర్ఆర్ (RRR)

2. ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)

3. కెజియఫ్: చాప్టర్ 2 (K.G.F: Chapter 2)

4. విక్రమ్ (Vikram)

5. కాంతార (Kantara)

6. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ (Rocketry: The Nambi Effect)

7. మేజర్ (Major)

8. సీతా రామం (Sita Ramam)

9. పొన్నియిన్ సెల్వన్ 1 (Ponniyin Selvan: I)

10. 777: చార్లి (777 Charlie)

బాలీవుడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బాయ్‌కాట్ ట్రెండ్ ఒక్క కారణంగా కనిపిస్తుంది. సినిమాల కంటే ఎక్కువగా కాంబినేషన్స్‌కే అక్కడి ఫిల్మ్ మేకర్స్ ప్రాధాన్యమిస్తుండటం మరో కారణం. రెమ్యూనరేషన్స్ భారీగా ఉండటంతో కథను వెండితెర మీద చూపించడానికి ఖర్చు చేయడం లేదు. ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి భారీగా బిజినెస్ చేయడంలో చూపించిన శ్రద్ధ, చిత్రంపై చూపించడం లేదు. గతంలో సౌత్ సినిమాలను రీమేక్ చేసి బాలీవుడ్ నిర్మాతలు సంపాదించేవారు. ప్రస్తుత ఓటీటీల కాలంలో ఒరిజినల్ వెర్షన్‌ను అప్పటికే చూసి ఉండటంతో రీమేక్‌లను కూడా ఆదరించడం లేదు. అందువల్ల ఒక్క బాలీవుడ్ చిత్రమే ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది.

Updated Date - 2022-12-14T17:03:17+05:30 IST