సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SS Rajamouli: రామాయణం చూసి రాజమౌళి ఏమన్నారంటే..

ABN, Publish Date - Nov 05 , 2026 | 02:40 PM

నితీష్ తివారి దర్శకత్వంలో ఎంతో  ప్రతిష్ట్మాకంగా నమిత మల్హోత్రా నిర్మించిన రామాయణ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

నితీష్(Nitesh Tiwari) తివారి దర్శకత్వంలో ఎంతో  ప్రతిష్ట్మాకంగా నమిత మల్హోత్రా నిర్మించిన రామాయణ (rAMAYANAM) చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను వీక్షించిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా విజువల్స్‌, నటీనటుల అభినయంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, రావణుడిగా యశ్‌, సీతగా సాయి పల్లవి నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. "రామాయణం సినిమా స్థాయి, వెండితెరపై ఆవిష్కరించిన విజువల్స్‌  ఎంతగానో ఆకట్టుకున్నాయి.

వనవాస ఘట్టం నుంచి రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ నటన ఎంతో చక్కగా వైభవంగా  ఉంది. రావణుడిగా యశ్‌ గంభీరమైన నటనతో అలరించారు. సీతగా సాయి పల్లవి ఎంతో హుందాగా, అందంగా కనిపించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలను ఎంతగానో ఆస్వాదించాను. సినిమాలోని ప్రతి ఘట్టం నాకు నచ్చింది. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, భారీ విజన్‌ను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన నిర్మాత నమిత్‌ మల్హోత్రా, దర్శకుడు నితేశ్‌ తివారీతో పాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు' అని ట్వీట్లో పేర్కొన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యశ్, కాజల్, రకుల్ కీలకపాత్రలు పోషించారు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 

 ALSO READ
చిరంజీవి అమెరికా టూర్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్‌పై థమన్ అదిరిపోయే అప్‌డేట్!

Meenakshi Chaudhary: మీనాక్షికి మరో ఆఫర్... ఎవరితో అంటే..

DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?

Updated Date - Nov 05 , 2026 | 03:29 PM