సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రాజమౌళి చెరిపేసిన సెంటిమెంట్స్ ఎన్నో.. ఇప్పుడు ‘వారణాసి’పై కొత్త చర్చ

ABN, Publish Date - Oct 10 , 2026 | 02:02 PM

ప్రస్తుతం ఆల్ ఇండియా సినిమా ఫ్యాన్స్ అందరినీ ఆకర్షిస్తోన్న డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్. రాజమౌళి అనే చెప్పాలి. అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రాజమౌళికి విషెస్ చెప్పారు.

SS Rajamouli

ప్రస్తుతం ఆల్ ఇండియా సినిమా ఫ్యాన్స్ అందరినీ ఆకర్షిస్తోన్న డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) అనే చెప్పాలి. అక్టోబర్ 10న రాజమౌళి బర్త్ డే‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రాజమౌళికి విషెస్ చెప్పారు. ఆయన ‘వారణాసి’ (Varanasi) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామనీ అంటున్నారు ఫ్యాన్స్. రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయన చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్స్‌ను గుర్తు చేసుకుందాం.

తెలుగు సినిమా అభిమానులకు రాజమౌళి చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్స్ గురించి బాగా తెలుసు. అలాగే చిత్రసీమలో నెలకొన్న కొన్ని సెంటిమెంట్స్‌ను రాజమౌళి చెరిపేసిన వైనాన్నీ జనం మరచిపోలేరు. రాజమౌళిని అల్లుకున్న సెంటిమెంట్స్‌లో మొదటిది అందరికీ సుపరిచితం. ఆయన సినిమాల్లో నటించిన హీరోలకు తరువాతి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు అనే సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు రాజమౌళి తెరకెక్కించిన 12 చిత్రాలలో నటించిన హీరోలందరూ గ్రాండ్ సక్సెస్ చూశారు. అయితే ఆ తరువాత వారి సినిమాలు ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోలేక పోయాయి. అంతేకాదు కొన్నిసార్లు అట్టర్ ప్లాప్స్ కూడా ఆ హీరోలను పలకరించాయి. ఈ సెంటిమెంట్‌ను ‘ట్రిపుల్ ఆర్’లో నటించిన యన్టీఆర్ ‘దేవర’ (NTR Devara) చెరిపేసింది అన్నారు.. కానీ, ఆ సినిమా ‘ట్రిపుల్ ఆర్’ (RRR Movie) రేంజ్ సక్సెస్ సాధించలేదు. ఇక మరో సెంటిమెంట్ ఏంటంటే రాజమౌళి పేరును ఉపయోగించుకున్న ఇతరుల చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. అందుకు తాజా ఉదాహరణ రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ మూవీ రిజల్ట్. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకునిగా వ్యవహరించారు. అంతకు ముందు కూడా రాజమౌళి పేరును జోడించుకున్న ఇతర చిత్రాలు పెద్దగా అలరించలేదు.


ఇక రాజమౌళి తెలుగు చిత్రసీమలో పలు సెంటిమెంట్స్‌ను తుడిచేశారు. తొలి సినిమాతో గ్రాండ్ సక్సెస్ సాధించిన డైరెక్టర్స్ రెండో చిత్రంతో ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేరు అన్న సెంటిమెంట్ ఒకటుంది. అయితే రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ కన్నా మిన్నగా రెండో చిత్రం ‘సింహాద్రి’తో విజయం సాధించారు. తెలుగునాట ఈ నాటికీ అత్యధిక కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ చూసిన సినిమాగా ‘సింహాద్రి’ నిలచే ఉంది. కేవలం టెక్నాలజీతోనే సాగిన తెలుగు డైరెక్టర్స్ దుమ్ముకొట్టుకు పోయారనీ కొందరి నమ్మకం. ఆ సెంటిమెంట్‌ను ‘ఈగ’తో తుడిచేశారు. తెలుగువారికి సీక్వెల్స్ అచ్చిరావని అనేవారు.. దానిని ‘బాహుబలి- ద కంక్లూజన్’ (Baahubali The Conclusion)తో చెరిపేయడమే కాదు, తెలుగువారికీ సీక్వెల్స్ పై మోజును పెంచేశారు రాజమౌళి. ఈ సినిమాతోనే ఇండియాలో వెయ్యి కోట్ల క్లబ్ మొదలైంది. ఇక టాలీవుడ్‌లో ఉన్న మరో సెంటిమెంట్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైట్ బ్యాక్ డ్రాప్‌లో బ్రిటిష్ వారిని చూపించిన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోవనే సెంటిమెంట్ ఉంది. ‘అల్లూరి సీతారామరాజు, సర్దార్ పాపారాయుడు’ వంటి చిత్రాలే బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.. మిగిలిన స్వరాజ్య పోరాట చిత్రాలు ఏ మాత్రం అలరించలేక పోయాయి. ఆ సెంటిమెంట్‌నూ కొట్టి పారేస్తూ ‘ట్రిపుల్ ఆర్’తో అదరహో అదరహా అనే రేంజ్‌లో సక్సెస్ చూశారు రాజమౌళి. అంతేకాదు ‘ట్రిపుల్ ఆర్’లోని ‘నాటు నాటు..’ సాంగ్ తోనే ఆస్కార్‌ను తెలుగు సినిమాకు అందించిన ఘనత రాజమౌళి పరమైంది. ఇలా పలు సెంటిమెంట్స్‌ను తుడిచేశారు రాజమౌళి.


రాజమౌళిని అల్లుకున్న సెంటిమెంట్స్, ఆయన తుడిచేసిన సెంటిమెంట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రాజమౌళి ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోన్న సెంటిమెంట్ ఒకటి కొత్తగా వచ్చి చేరింది. అదేమిటంటే రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ పరాజయం పాలైంది. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకునిగా వ్యవహరించారు. మరి రాజమౌళి ఎంతో ప్రిస్టేజియస్‌గా తెరకెక్కిస్తోన్న మహేశ్ బాబు ‘వారణాసి’కి కూడా కార్తికేయ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పరిస్థితి ఏంటో అని కొందరిలో డౌట్ ఉంది. అయితే ఇలాంటి అనుమానాలు తలెత్తిన ప్రతీసారి ఆ సెంటిమెంట్స్‌ను తన డైరెక్టోరియల్ వెంచర్స్‌తో చెరిపేశారు రాజమౌళి. కాబట్టి, ఇక్కడ రాజమౌళి డైరెక్షన్‌లో ‘వారణాసి’ తెరకెక్కుతోంది కాబట్టి ఏ మాత్రం డౌట్ పడక్కర్లేదని అంటున్నారు ఫ్యాన్స్. 120 దేశాల్లో ‘వారణాసి’ చిత్రం విడుదల కానుంది.. కాబట్టి నిర్మాతలు కార్తికేయ, డాక్టర్ కె.యల్.నారాయణకు ‘వారణాసి’తో లాభాలే కానీ నష్టాలు ఉండవని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.. ఏమవుతుందో వచ్చే యేడాది ఏప్రిల్ 7న తేలనుంది. ఈలోపు ఆయన బర్త్‌డేను పురస్కరించుకుని.. తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచాలని కోరుతూ శుభాకాంక్షలు చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే దర్శకధీరా!

ఇవి కూడా చదవండి:

రజనీకాంత్ - కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ ఆగిపోయిందా?

మోక్షజ్ఞ ఎంట్రీకి వశిష్ట మైండ్ బ్లోయింగ్ ప్లాన్

‘జై హనుమాన్’లో మమితా బైజు.. ప్రశాంత్ వర్మా, అసలేం తీస్తున్నావ్..

Updated Date - Oct 10 , 2026 | 02:09 PM