‘జై హనుమాన్’లో మమితా బైజు.. ప్రశాంత్ వర్మా, అసలేం తీస్తున్నావ్..

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:43 PM

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Mamitha Baiju in Jai Hanuman

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ (Jai Hanuman). తేజ సజ్జా (Teja Sajja) హీరోగా వచ్చిన ‘హను-మాన్’ బాక్సాఫీస్ వద్ద సాధించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఫిబ్రవరిలో హంపి వేదికగా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఓ క్రేజీ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


‘ప్రేమలు’ చిత్రంతో యూత్‌కి క్రష్‌గా మారి, వరుస హిట్‌లతో సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన మమితా బైజు (Mamitha Baiju) ఈ భారీ మైథలాజికల్ సీక్వెల్‌లో ఎంపికైనట్లు ప్రచారం జోరందుకుంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం ప్రశాంత్ వర్మ ఆమెను సంప్రదించారని, ఇప్పటికే ఆమె ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty) సాక్షాత్తూ హనుమంతుడి పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు రానా దగ్గుబాటి పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు వీరితో పాటు మమితా బైజు లాంటి టాలెంటెడ్ నేచురల్ పెర్ఫార్మర్‌ను కూడా ఈ యూనివర్స్‌లోకి దించుతుండటంతో.. ‘‘ప్రశాంత్ వర్మా, అసలేం తీస్తున్నావ్ గురూ.. క్యాస్టింగ్‌తోనే పూనకాలు తెప్పిస్తున్నావుగా!’’ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


కలియుగంలో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే దివ్యమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ ప్రమాణాలతో నిర్మిస్తోంది. మైథాలజీ అంశాలకు నేటితరం ఎమోషన్స్‌ను జోడించి తీయడంలో ప్రశాంత్ వర్మ దిట్ట. మరి, ఇప్పటికే ఉన్న తారాగణంతో పాటు.. రిషబ్ శెట్టి, రానా, మమితా బైజుల కలయికలో ప్రశాంత్ వర్మ వెండితెరపై ఎలాంటి విజువల్ విస్ఫోటనాన్ని సృష్టిస్తారో చూడాలి. ఈ క్యాస్టింగ్ అప్‌డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

మణిరత్నం సినిమా కోసం విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం

సుమలత పిటిషన్‌తో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

Updated Date - Oct 09 , 2026 | 01:43 PM