సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అవకాశాల కోసం ఎదురుచూపు!

ABN, Publish Date - Apr 23 , 2026 | 05:28 PM

మొన్నటి వరకూ అసలు టాలీవుడ్‌లో శ్రీలీల తప్ప ఎవరూ లేరా అన్నట్టుగా ఉండేది సిచ్యుయేషన్. కానీ వరుస ప్లాఫులు ఈ బ్యూటీని ఇప్పుడు కనిపించకుండా చేసేశాయి. ఫలితంగా పక్క భాషలపై కన్నేసిన అమ్మడు అదృష్టం కోసం వెయిట్ చేస్తోంది.

టాలీవుడ్ టాప్ బ్యూటీ శ్రీలీలకు పెద్ద కష్టమే వచ్చింది. వరుస అవకాశాలతో, హిట్స్‌తో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ స్పీడ్‌కు బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో చిన్నదానికి నిదానంగా అవకాశాలు తగ్గిపోయాయి. మొన్నటి వరకూ కాల్షీట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ సొగసరి ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


తెలుగులో మొదటి సినిమా 'పెళ్లి సందడి' తో యూత్ క్రష్‌గా మారింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'ధమాకా' సూపర్ హిట్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్టు డిజాస్టర్లుగా మారాయి. 'పుష్ప- 2'లో చేసిన 'కిస్సిక్' స్పెషల్ సాంగ్‌తో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన ఎనర్జిటిక్ డాన్స్‌కు బాలీవుడ్, తమిళ ప్రేక్షకులే కాదు మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. అలా శివ కార్తికేయన్‌ 'పరాశక్తి'తో తమిళ్‌లోకి అడుగుపెట్టిందీ అందాల భామ. కానీ అది పెద్దగా ఆడలేదు. ఇటు 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్‌ సరసన నటించినా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఆఫర్లు లేకపోవడంతో శ్రీలీల ఇతర భాషలపై ఫోకస్ పెట్టింది.

హిందీలో అనురాగ్ బసు తీస్తున్న మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్ హీరో. ఈ మూవీ కోసం శ్రీలీల జీరో సైజ్‌ మెయిన్ టైన్ చేస్తోందట.ఈ మూవీపై ఆమె భారీగానే ఆశలు పెట్టుకుందని అంటున్నారు. అంతే కాదు... ఈ సినిమా తర్వాత అనురాగ్‌ బసు తీయబోయే కిశోర్‌ కుమార్ బయోపిక్‌లోనూ ఈమెకు అవకాశం లభించబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తమిళ్‌లో ధనుష్ హీరోగా రూపొందుతున్న 'డి55' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో సాయి పల్లవి ఒక నాయిక కాగా శ్రీలీల సెకండ్‌ లీడ్‌ చేస్తోంది. బాలీవుడ్ డెబ్యూ సక్సెస్ అయినా ధనుష్ సినిమా హిట్ కొట్టిన మళ్ళీ ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Read Alos: AA23: అల్లు అర్జున్‌తో మాట్లాడక ఉత్సాహం రెట్టింపయింది..

Read Also: తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

Updated Date - Apr 23 , 2026 | 05:39 PM