AA23: అల్లు అర్జున్‌తో మాట్లాడాక ఉత్సాహం రెట్టింపయింది..
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:27 PM
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ప్రస్తుతం ‘రాకా’తో బిజీగా ఉన్నారు. తదుపరి మరో ప్రాజెక్ట్‌ను కమిట్ అయ్యారు.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ప్రస్తుతం ‘రాకా’తో బిజీగా ఉన్నారు. తదుపరి మరో ప్రాజెక్ట్‌ను కమిట్ అయ్యారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ‘ఏఏ 23’ (AA23) చిత్రం చేయబోతున్నారు. ఇది కూడా భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్న రత్నకుమార్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పుకొచ్చారు.
‘ఏఏ 23’ ప్రీ ప్రొడక్షన్ పరులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌కు సిద్దమవుతున్నాం. కచ్చితంగా ఇది అంతర్జాతీయ ఆడియన్స్‌కు నచ్చే కంటెంట్ ఉన్న సినిమా. ఈ చిత్రంలో నటీనటులు, వారి పాత్రలను బట్టి ఇలా చెప్పడం లేదు. గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించే డెప్త్ ఉన్న కంటెంట్ ఈ కథలో ఉంది. కథా చర్చలు పూర్తయ్యాక అల్లు అర్జున్‌తో మాట్లాడటంతో మా టీమ్‌లో రెట్టింపు ఉత్సాహం పెరిగింది. మే రెండో వారం నుంచి మరింత వేగవంతంగా పనులు ముందుకెళ్తాయి’ అని అన్నారు.