సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela: 'ఉస్తాద్' పై శ్రీలీల హోప్స్

ABN, Publish Date - Jan 14 , 2026 | 06:54 PM

పవర్ స్టార్ సినిమా కోసం ఫ్యాన్స్ కంటే కూడా శ్రీలీలనే కోటి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడూ ఆ సినిమా వస్తుందా, తన ఫేట్ మారుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకొని ఉందీ భామ. ఒకప్పుడు మరో ముద్దుగుమ్మ తలరాత మారినట్టే తనకూ టైం వస్తుందని ఆశలు పెట్టుకుంది.

ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం కఠిన దశలో ఉంది. హీరోయిన్ గానే కాకుండా 'భగవంత్ కేసరి' మూవీలో కీలకపాత్ర పోషించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నా... ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఈ బ్యూటీని ఇబ్బంది పెట్టాయి. 'పుష్ప 2'లో అల్లు అర్జున్‌తో ఐటెమ్ సాంగ్ మినహా గత రెండేళ్ళలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కొంది. కోలీవుడ్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన శివ కార్తికేయన్‌తో 'పరాశక్తి'లో నటించింది. ఆమె రోల్ కు మంచి మార్కులే పడినప్పటికి.. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సొగసరి ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే ఉన్నాయి.


పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' శ్రీలీల మెరవనుంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. దీంతో సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని అటు శ్రీలీల ఇటు హరీష్ శంకర్ ఎదురు చూస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్, విజిల్ మూమెంట్స్‌ సినిమాలో ఉండటంతో గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి చూస్తే గతంలో శ్రుతి హాసన్ ఎదుర్కొన్న సిచ్యుయేషన్ గుర్తు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లలో శ్రుతి హాసన్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పటికి... వరుస డిజాస్టర్లతో కెరీర్ డౌన్ అయింది. అప్పుడు పవన్ కళ్యాణ్‌తో చేసిన 'గబ్బర్ సింగ్' ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. పైగా ఓవర్ నైట్ టాప్ లీగ్ హీరోయిన్‌గా మార్చేసింది. ఆ ఊపుతో తెలుగు, తమిళంలో భారీ ఛాన్స్ లు కొట్టేసింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు శ్రీలీల కెరీర్ కూడా అలాంటి దశలోనే ఉంది. చేసిన సినిమాలు చేసినట్లు పరాజయాలు కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రంలో మంచి రోల్ తో పాటు యాక్టింగ్ స్కోప్ గా క్యారెక్టర్ చేస్తుండంతో గట్టిగానే ఆశలు పెట్టుకుంది. చూస్తుంటే శ్రుతికి 'గబ్బర్ సింగ్' లాంటి టర్నింగ్ పాయింట్ శ్రీలీలకు 'ఉస్తాద్...' ఇస్తుందని భావిస్తున్నారట సినీ విశ్లేషకులు. కనీసం పవర్ స్టార్ మూవీతో అయినా శ్రీలీల మంచి సక్సెస్ ను అందుకోవాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Read Also: Megastar: 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర బృందానికి చిరు గ్రాండ్ పార్టీ

Read Also: Pawan Kalyan: పవన్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ సినిమాలు

Read Also: AA23: సంక్రాంతి సర్‌ప్రైజ్‌... బన్నీ ఫ్యాన్స్ లో జోష్

Updated Date - Jan 14 , 2026 | 07:03 PM