సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: ‘సింగ్‌ గీతం’.. మరో అద్భుతం

ABN, Publish Date - Jun 15 , 2026 | 06:11 AM

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగ్‌ గీతం’ సినిమాపై దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రశంసలు కురిపించారు.

Sing Geetham

అయాన్ (Ayaan), శాలినీ కొండెపూడి (Shalini Kondepudi), అహల్య బమ్రూ (Ahilya Bamroo) ప్రధాన పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సింగ్‌ గీతం’. నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్ (Rahul Ravindran), హీరోయిన్‌ నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ (Vaijayanthi Movies) బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్ (Nag Ashwin) నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆదివారం గోల్డెన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి ద‌ర్శ‌కుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ కార్యక్రమంలో నాగ్‌ అశ్విన్ , దేవిశ్రీప్రసాద్‌, రాహుల్‌ రవీంద్రన్‌, నివేథా పేతురాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘ఓ దర్శకుడు తన కెరీర్‌లో ఒక ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌ చేయడమే కష్టం. అలాంటిది సింగీతం శ్రీనివాసరావు (Singeetam Srinivasa Rao) చేసిన సినిమాలన్నీ ఆదిత్య 369, పుష్పక విమానం, భైరవద్వీపం... ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన మైలురాయి. అలానే ‘సింగ్‌ గీతం’ (Sing Geetham) ఆయన తీసిన మరో అద్భుతం. అతి తక్కువ ప్రచారంతో, విడుదలకు ముందు ట్రైలర్‌ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ‘సింగ్‌ గీతం’ నన్ను ఆశ్చర్యపరిచింది’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) అన్నారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. సినిమా చూశాను. చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది. కానీ నాకు లోలోపల ఒక ఫీలింగ్ వచ్చింది. మనం ఒక సినిమా తీసి, చాలా కష్టపడి ట్రైలర్ కట్ చేసి రిలీజ్ చేస్తుంటాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ట్రైలర్ లేకుండానే సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. అది నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. నేనూ కూడా ట్రైలర్ లేకుండా అందంగా ప్రమోట్ చేసి సినిమా చేయాలని ఉంది. (నవ్వుతూ) కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైలర్ లాంచ్ అంటున్నారు. ఒక సినిమా రిలీజ్ అయి, మంచి టాక్ తెచ్చుకుని, సక్సెస్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం నిజంగా చాలా వింతగా, చాలా కొత్తగా ఉందన్నారు. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. ఇంకా చూడని వారు తప్పకుండా థియేటర్లలోనే ఈ సినిమాను చూడాలని కోరారు.

ఈ టీమ్‌లో చాలా మ్యాడ్‌నెస్ ఉంది. సింగీతం గారు దాదాపు ఏడు సంవత్సరాల క్రితమే నాకు ఈ సినిమా ఆలోచన చెప్పారు. ఆయన కథ చెప్పిన తర్వాత చాలామంది నిర్మాతలను కలిశాను. కానీ అది ఎక్కడా మెటీరియలైజ్ కాలేదు. ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఎవరైనా నిలబడితే బాగుంటుందని అనిపించేది. కొన్ని సంవత్సరాల తర్వాత అది నాగ్ అశ్విన్ రూపంలో సాధ్యమైంది. సింగీతం గారి నుంచి మరో ల్యాండ్‌మార్క్ సినిమాను ప్రేక్షకులకు అందించిన నాగ్ అశ్విన్ గారికి, వైజయంతి మూవీస్‌కు హ్యాట్సాఫ్. సింగీతం గారు వెంటనే మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అవకాశం వస్తే ఆయన టీమ్‌లో నేను కూడా పనిచేయాలని ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు అందించిన సంగీతానికి ప్రత్యేకంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్ వర్క్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. టీం అందరికీ అభినందనలు అంటూ ముగించారు.

Updated Date - Jun 15 , 2026 | 06:48 AM