సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కచ్చితంగా నో చెప్తా.. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ బోల్డ్ ఆన్సర్

ABN, Publish Date - Nov 24 , 2026 | 10:04 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Shruti Haasan on Peddi Controversy

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చూపించిన విధానంపై విమర్శలు రావడం, ఇటీవల ఓ టాక్ షోలో జాన్వీ స్వయంగా ఆ సన్నివేశాలపై విచారం వ్యక్తం చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఇదే సినిమాలో ‘హెల్లల్లల్లో’ (Hellallallo) అనే ప్రత్యేక గీతంలో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేసిన స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruthi Haasan) తాజాగా ఈ అంశంపై స్పందించారు.

తాజాగా ఆమె హాజరైన ఓ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ అనుభవాన్ని, జాన్వీ కపూర్ వివాదంపై తన అభిప్రాయాన్ని శ్రుతి హాసన్ ఎంతో నిజాయితీగా పంచుకున్నారు. ముందుగా జాన్వీ కపూర్ అనుభవంపై స్పందించేందుకు నిరాకరిస్తూ.. ‘‘వేరొకరి అనుభవాల గురించి నేను మాట్లాడటం సరైనది కాదు. ఎందుకంటే ఇతర మహిళల తరఫున నేను మాట్లాడలేను, అలాగే నా గురించి వారు మాట్లాడలేరు’’ అని సున్నితంగా దాటవేశారు.


అయితే షూటింగ్ సమయంలో తన హద్దులు, కంఫర్ట్ గురించి శ్రుతి హాసన్ బోల్డ్‌గా మాట్లాడారు. ‘‘నాకు డ్యాన్స్ చేయడం, అందంగా తయారవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ పాట చేయడానికి ఒప్పుకున్నాను. అయితే నాకు ఏదైనా కాస్ట్యూమ్ గానీ, స్టెప్ గానీ అసౌకర్యంగా అనిపిస్తే నేను కచ్చితంగా చేయనని మొహం మీదే చెప్పేస్తాను. గతంలో ఇలాంటి విషయాల్లో నాకు వాదనలు కూడా జరిగాయి. దానివల్ల నన్ను ‘డిఫికల్ట్’ పర్సన్ అని ముద్ర వేసినా నాకు అభ్యంతరం లేదు. నేను ఒక పాట గానీ, సన్నివేశం గానీ చేస్తున్నానంటే అది నాకు పూర్తిగా కంఫర్ట్‌గా ఉన్నట్లే లెక్క’’ అని శ్రుతి స్పష్టం చేశారు.


షూటింగ్ సెట్‌లో తన టీమ్‌తో ఎప్పుడూ ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుందని, ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే చర్చించి పరిష్కరించుకుంటామని శ్రుతి పేర్కొన్నారు. అయితే, అందరూ ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని విషయాలు అందరి దృష్టి దాటి జరిగిపోతుంటాయని ఆమె అంగీకరించారు. మొత్తానికి ‘పెద్ది’ వివాదం వేళ షూటింగ్ సెట్లలో నటీనటుల సౌకర్యం, స్పష్టమైన కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో చెబుతూ శ్రుతి హాసన్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘కింగ్‌ 100’ వాయిదా తప్పదా.. ఇక స్టార్ట్ చేయండయ్యా

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

Updated Date - Nov 24 , 2026 | 10:04 PM