సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాత్ రూమ్ వీడియోలు తీసి వేధించిన కామాంధులు..నటి ఆత్మహత్య

ABN, Publish Date - Jun 12 , 2026 | 04:04 PM

సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకు ఎంతోమంది ఎదగాలనే వస్తారు. కానీ,కొంతమంది మాత్రం నిలబడతారు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సులు దొరక్క తప్పుడు దారుల్లో పయనిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Amulya Sri

సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడకు ఎంతోమంది ఎదగాలనే వస్తారు. కానీ,కొంతమంది మాత్రం నిలబడతారు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి ఛాన్సులు దొరక్క తప్పుడు దారుల్లో పయనిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొందరు .. అమాయకమైన అమ్మాయిలను అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా ఒక యువతి హీరోయిన్ అవ్వాలనే బలమైన కోరికతో, ఎన్నో ఆశలు, ఆశయాలతో హైదరాబాద్ నగరానికి వచ్చి శవమై తేలింది. షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ (Amulya Sri), కొంతమంది కామాంధుల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది.


అమూల్య శ్రీ.. ఒక అందమైన యువతి. సినిమాల్లో నటించడం అనేది తన కోరిక. తండ్రి లేడు. తల్లిని ఒప్పించి.. నటిగా మారాలని హైదరాబాద్ చేరుకుంది. ఎన్నో కష్టాలు పడుతూ.. షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం దక్కించుకుంది. నెమ్మదిగా అవకాశాలను అందుకొని నటిగా ఎదగాలనుకుంది. కానీ, ఆమె ఆశలను కొంతమంది కామాంధులు చిదిమేశారు. అమూల్య బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా కొంతమంది కామాంధులు వీడియోలు తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. గత 6 నెలలుగా వారు తమ కోరిక తీర్చడానికి రావాలని, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి కెరీర్ నాశనం చేస్తామంటూ అమూల్యని బెదిరించసాగారు.


ఇక ఈ నరకం నుండి తనను కాపాడాలని, తనకు న్యాయం చేయాలంటూ అమూల్య శ్రీ ముందే పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రక్షణ కల్పించాల్సిన పోలీసుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య గత నెల 28 న ఆత్మహత్య చేసుకొని మరణించింది. తండ్రి లేకపోవడం ఒకటి, కనీసం ఆర్థిక స్థోమత కూడా లేక న్యాయం కోసం అమూల్య తల్లి, సోదరి తమకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా సైదాబాద్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


అమూల్య తల్లి మాట్లాడుతూ.. ' నా కూతురు చాలా నరకం అనుభవించింది. వాళ్ళందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అమ్మా అని చెప్పింది. ఎవరైతే నా కూతురు మరణానికి కారణమో వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి' అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో భవిష్యత్ ఉన్న అమూల్య చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయాలని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Ravi Teja: ఆ పాత్రలో రవితేజ నిజమేనా.. అభిమానులు ఒప్పుకుంటారా?

KA13: గ్యాప్ ఇవ్వు అన్నా.. అప్పుడే ఇంకొకటా

Puri jagannadh: ‘స్లమ్‌డాగ్‌: 33' మేకింగ్ వీడియో వైరల్

Updated Date - Jun 12 , 2026 | 04:51 PM