KA13: గ్యాప్ ఇవ్వు అన్నా.. అప్పుడే ఇంకొకటా
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:06 PM
టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జోరు పెంచేశాడు. 'క' సినిమా హిట్ తో స్పీడు పెంచిన కిరణ్ గతేడాది కె ర్యాంప్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు.
టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) జోరు పెంచేశాడు. 'క' సినిమా హిట్ తో స్పీడు పెంచిన కిరణ్ గతేడాది కె ర్యాంప్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ ఏడాది నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవి అనే సినిమాను తెరకెక్కించాడు. హీరోగా సక్సెస్ అయిన కిరణ్.. నిర్మాతగా దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్టర్ గానే మారి ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన నటించిన చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ కి సిద్దమవుతుండగా.. తాజాగా కిరణ్ తన కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం KA13 షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఇక ఈ పూజా కార్యక్రమంతో పాటు మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్లలో కిరణ్ అబ్బవరం లుంగీ కట్టుకుని, చుట్టూ ఆవిర్లు, మసాలాల మధ్య ఒక భారీ వంట పాత్రలో గరిటె తిప్పుతూ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బిజినెస్, హాస్పిటాలిటీ, కుకింగ్ బ్యాక్‌డ్రాప్ కలబోతగా ఒక ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా.. మాస్ పల్స్ తెలిసిన ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కిరణ్ సరసన దేవిక భట్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా కిరణ్ అబ్బవరం తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు. ఇక కిరణ్ వరుస ప్రాజెక్ట్స్ చూసి అభిమానులు.. కొంచెం గ్యాప్ ఇవ్వు అన్నా.. అప్పుడే ఇంకొకటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి:
నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ
బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ వేట.. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
నిన్న అల్లు అర్జున్.. నేడు అఖిల్.. చరణ్ యాక్టింగ్‌కు ఫిదా!