సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఆ ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరితో

ABN, Publish Date - Aug 28 , 2026 | 10:51 PM

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అఖండ విజయం దర్శకుడు శివ నిర్వాణ మార్కెట్ విలువను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది.

Director Shiva Nirvana

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న అఖండ విజయం దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) మార్కెట్ విలువను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. ఈ సినిమాతో రవితేజతో పాటు శివ నిర్వాణ కూడా 200 కోట్ల క్లబ్‌లోకి చేరబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ. 135కి పైగా కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. భావోద్వేగాలను, కమర్షియల్ హంగులను సమపాళ్లలో మేళవించి ‘ఇరుముడి’ని బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దిన ఆయన టేకింగ్‌కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ భారీ సక్సెస్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అగ్ర కథానాయకులు ఆయనతో పనిచేసేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. స్టార్ హీరోలు సూర్య (Suriya), ధనుష్ (Dhanush), అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya).. ఈ ముగ్గురిలో ఒకరితో శివ నిర్వాణ తన తదుపరి ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.


ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ సూర్య నేరుగా ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. శివ నిర్వాణ ప్రతిభ, ఆయన ఎమోషనల్ కథనాలపై నమ్మకంతో సూర్య ఆయనతో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సూర్య బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే పక్కా స్క్రిప్ట్ సిద్ధమైతే వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. అలాగే మరో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సైతం ‘ఇరుముడి’ సినిమాను వీక్షించి, అందులోని దర్శకుడి పనితనాన్ని ఎంతగానో మెచ్చుకున్నారనే విషయం తెలియంది కాదు. తన శైలికి తగిన మంచి కథను సిద్ధం చేస్తే వెంటనే ప్రాజెక్ట్ చేద్దామని ధనుష్ స్వయంగా శివ నిర్వాణతో ఆసక్తి వ్యక్తం చేసినట్లు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.


వీరితో పాటు అక్కినేని నాగచైతన్యతో మరోసారి శివ నిర్వాణ చేతులు కలిపే అవకాశాలను కొట్టిపారేయలేం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మజిలీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరి మధ్య ఉన్న బలమైన అనుబంధం, మంచి సాన్నిహిత్యం దృష్ట్యా మరోసారి వీరి క్రేజీ కాంబో రిపీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు సూర్య, ధనుష్ లాంటి పాన్-ఇండియా రేంజ్ ఉన్న స్టార్స్ తో పాటు నాగచైతన్య కూడా లైన్‌లో ఉండటంతో.. శివ నిర్వాణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎవరితో లాక్ చేస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ముగ్గురు అగ్ర కథానాయకుల్లో ఎవరికి పర్ఫెక్ట్ కథ సెట్ చేసి ఆయన అనౌన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

నాకంటే ఎక్కువ రెమ్యూనరేషనా?.. ప్రభాస్‌ని దీపికా అవమానించిందా

‘ఇరుముడి’ ఎఫెక్ట్.. రవితేజ హారర్ చిత్రానికి నిర్మాతలు దొరికేశారోచ్!

నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్

Updated Date - Aug 28 , 2026 | 10:51 PM