నిర్మాత ఎస్కేఎన్‌కు రాఖీ కట్టిన హీరోయిన్.. అంతా షాక్
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:06 PM
చిత్ర పరిశ్రమ అంటే కేవలం నెగిటివ్ విషయాలే కాదు.. గౌరవప్రదమైన, పవిత్రమైన బంధాలు కూడా ఇక్కడ చిగురిస్తాయని చాటిచెబుతూ ఇప్పుడో హీరోయిన్ ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై వచ్చే పుకార్లు, వివాదాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్స్ అనే పదాలు నిత్యం వినిపిస్తూ ఇండస్ట్రీ వాతావరణంపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. పరిశ్రమలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలన్నా, అవకాశాలు రావాలన్నా ఎన్నో ఒడిదుడుకులు, కమిట్‌మెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందనే ప్రచారం తరచూ వినిపిస్తూ అనేక అనుమానాలకు తావిస్తుంటుంది. కానీ, చిత్ర పరిశ్రమ అంటే కేవలం అలాంటి విషయాలే కాదు.. గౌరవప్రదమైన, పవిత్రమైన బంధాలు కూడా ఇక్కడ చిగురిస్తాయని చాటిచెబుతూ నటి శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
రక్షాబంధన్ (Rakshabandhan) పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గౌరీ ప్రియ తన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్ర నిర్మాత ఎస్కేఎన్ (SKN) నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయనకు సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, చేతికి రాఖీ కట్టి తన సోదర ప్రేమను చాటుకున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ఏర్పడిన అనుబంధం, వృత్తిపరమైన పరిధిని దాటి సొంత అన్నచెల్లెళ్ల అనుబంధంగా మారింది. నిర్మాత ఎస్కేఎన్ తనను ఒక సోదరిలా చూసుకుంటూ ప్రోత్సహించడంతో, ఈ పండుగ వేళ ఆయనకు రాఖీ కట్టి తన కృతజ్ఞతను, ఆత్మీయతను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో వినిపించే రొటీన్ రూమర్లకు, నెగిటివ్ ప్రచారాలకు ఈ ఘటన ఒక పెద్ద సమాధానంలా నిలిచింది. నిర్మాతలకు, నటీనటులకు మధ్య కేవలం వ్యాపార సంబంధాలే కాకుండా.. ఇలాంటి అద్భుతమైన ఆత్మీయ బంధాలు, కుటుంబ వాతావరణం కూడా ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. ‘స్క్రిప్ట్ పరిధిని దాటి అల్లిన అందమైన బంధం ఇది’ అంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు వీరిద్దరి అనుబంధాన్ని చూసి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించే ఇలాంటి దృశ్యాలు చిత్ర పరిశ్రమపై ఉన్న నెగిటివ్ భావనలను తుడిచిపెట్టేందుకు ఎంతగానో దోహదపడతాయని సినీ విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శర్వా ‘భోగి’.. రాఖీ స్పెషల్ పోస్టర్ వైరల్
‘శతచిత్ర మన్మథుడు’.. కింగ్ నాగ్‌కు హ్యాపీ బర్త్‌డే
విమెన్ ఆబ్జెక్టిఫికేషన్.. ‘పెద్ది’పై ఏడ్చిన వారంతా ‘టాక్సిక్’కు ఏమైపోయారు