Satya: మే 1న జెట్లీ ఆగమనం...
ABN, Publish Date - Apr 18 , 2026 | 10:19 AM
సత్య హీరోగా పరిచయం అవుతున్న 'జెట్లీ' మూవీ మే 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది.
కమెడియన్ సత్య (Satya) హీరోగా నటిస్తున్న సినిమా 'జెట్లీ' (Jetly). 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో ఈ సినిమాను చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తోంది. ఏప్రిల్ 30న రావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్‌కు వాయిదా పడడంతో ఇప్పుడీ సినిమాను మే 1న విడుదల చేస్తున్నారు. అయితే మే 1వ తేదీన తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham) సినిమా కూడా విడుదల కాబోతోంది.
ఇక 'జెట్లీ' మూవీ విషయానికి వస్తే ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫన్ గ్లింప్స్, సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సత్య, వెన్నెల కిశోర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో డైనమిక్‌గా నడుస్తూ వస్తుండటం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి:
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.
మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!