అటు ‘స్పిరిట్’.. ఇటు ‘రోమాంచకం’.. సందీప్ వంగా ప్లానింగ్ అదుర్స్!

ABN , Publish Date - May 29 , 2026 | 06:05 PM

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో సంచలన విజయాలు అందుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడాయన ‘రోమాంచకం’ అనే మూవీని సమర్పిస్తున్నారు.

Sandeep Reddy Vanga Launched Romanchakam Poster

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో సంచలన విజయాలు అందుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ప్రస్తుతం ఆయన రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas)తో ‘స్పిరిట్’ (Spirit) అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో కూడా తెలియంది కాదు. ఒక వైపు ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సరికొత్త యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’ (Romanchakam) అనే చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. ఆయన సోదరుడు, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ (Bhadrakali Pictures) బ్యానర్‌పై ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. యంగ్ టీమ్‌తో కలిసి వంగా బ్రదర్స్ ఈ సినిమాను చేస్తుండటంతో.. ‘రోమాంచకం’‌పై భారీగా అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ వేదికగా విడుదల చేశారు.


‘‘కథ వింటున్నంత సేపూ నేను హాయిగా నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వెనుక ఒక బలమైన ఎమోషనల్ టచ్ కూడా ఉంది. మొదటిసారిగా నేను ఒక సినిమాను సమర్పిస్తున్నాను. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి ఒక వినూత్నమైన మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని సందీప్ వంగా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలు షోషిస్తుండగా.. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే.. సరికొత్త యూత్ ఫుల్ వైబ్స్, ఎమోషనల్ ఫీల్‌తో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. పోస్టర్‌లో చూపించిన ఫింగర్ హార్ట్ సైన్, కలర్‌ఫుల్ డిజైన్ సినిమా ఎంత ఫ్రెష్‌గా ఉండబోతోందో తెలియజేస్తున్నాయి. సుమంత్ ప్రభాస్, అనంతికల సరికొత్త జోడీ ఈ వినూత్న కథకు మరింత నిండుదనాన్ని తీసుకురానుందని మేకర్స్ చెబుతున్నారు.


ఈ పోస్టర్‌తో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అందమైన భావోద్వేగాలతో సాగే ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చిత్రమని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా పోస్టర్ పై ఉన్న ‘ప్రేమ, హాస్యం, ఉత్కంఠ’అనే ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. వాసుకి వైభవ్ సంగీతం, పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి డిజిటల్ భాగస్వామిగా నెట్‌ఫ్లిక్స్ వ్యవహరిస్తోంది. పలువురు ప్రతిభావంతులైన యువ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ ‘రోమాంచకం’ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!

ఆడియో జ్యూక్ బాక్స్ విడుదల.. ‘పెద్ది’ టీమ్ తప్పు చేసిందా?

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

Updated Date - May 29 , 2026 | 06:05 PM

Sandeep Reddy Vanga: అప్పట్లో రంగస్థలం.. ఇప్పుడు పొట్టేల్‌

Sandeep Reddy Vanga: చిరంజీవి పేరుతో సమాధానమిచ్చేసరికి అంతా షాక్‌!

Sandeep Reddy Vanga: నటసింహం బాలయ్యకి ఫ్యాన్ అయిపోయా..

Sandeep Reddy Vanga: ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలకు అందుకే వెళ్లను

Sandeep Reddy Vanga: ప్రభాస్‌ 24 సినిమాలు వేరు... ఈ సినిమా వేరు!