జర్నలిస్ట్ బాడీ షేమింగ్‌పై సంపూ క్లారిఫికేషన్.. ఏమన్నారంటే
ABN, Publish Date - Sep 25 , 2026 | 04:16 PM
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో (‘ద ప్యారజైన్’ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం) తనపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, అవమానకర ప్రశ్నలకు సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పందించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో (‘ద ప్యారజైన్’ మూవీ ప్రమోషన్స్ నిమిత్తం) తనపై జరిగిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, అవమానకర ప్రశ్నలకు సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) స్పందించారు. సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ అభిమానులు సదరు జర్నలిస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు అండగా నిలుస్తున్న తరుణంలో.. ఈ వివాదానికి ముగింపు పలికేలా సంపూ ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసి.. ఇష్యూపై పూర్తి వివరణ ఇచ్చారు.
ఆ వీడియోలో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోను నేను కూడా చూశాను. ఆ జర్నలిస్ట్ నాకు ఎంతో క్లోజ్. మా ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంది. మాటల ఫ్లోలో ఆ మాటలు దొర్లాయి తప్పితే కావాలని అన్నవి కావు. అసలు మా మధ్య ఉన్న చనువు దృష్ట్యా అది దొర్లిన మాట అని కూడా నేను అనుకోను. మీడియాలోని చాలా మంది జర్నలిస్టులు, రిపోర్టర్లు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.. నన్ను సొంత తమ్ముడిలా, బ్రదర్‌లా చూసుకుంటారు. మొదటి చిత్రం ‘హృదయ కాలేయం’ నాటి నుంచి నన్ను ఆదరిస్తూ, సపోర్ట్ చేస్తున్న పాత్రికేయులందరితో పాటు ఆయన కూడా నాకు ఎంతో ఇష్టమైన, ప్రేమించే వ్యక్తి’’ అని తెలిపారు.
తమ మధ్య కేవలం స్నేహం, చనువు కొద్దీ జరిగిన సంభాషణను వివాదం చేయవద్దని కోరుతూ.. ‘‘నన్ను అభిమానించే ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా దయచేసి దీన్ని తప్పుగా భావించవద్దు, నెగెటివ్‌గా తీసుకోవద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని సంపూ విజ్ఞప్తి చేశారు. ఎప్పటిలాగే ప్రేక్షకుల ప్రేమానురాగాలకు బానిసనై ఉంటానంటూ ఆయన నమస్కారంతో వీడియోను ముగించారు. తనను వ్యక్తిగతంగా అన్న మాటలను సైతం సీరియస్‌గా తీసుకోకుండా, తోటి వారిని వెనకేసుకొస్తూ సంపూ చూపించిన పెద్ద మనసు, సంస్కారానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ స్ట్రిక్ట్ రూల్స్.. ఎందుకంటే
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఊసేది.. ‘ఏకే 47’ పాటేది.. అసలేం జరుగుతుంది?
ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ టీమ్ చేయాల్సింది ఇదేనా..