సమవర్తి టీజర్.. సత్యదేవ్ విశ్వరూపం

ABN , Publish Date - Sep 19 , 2026 | 08:51 PM

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ఈ మధ్యనే రావు బహదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

Samavarthi

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) ఈ మధ్యనే రావు బహదూర్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్నా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక సత్యదేవ్ మాత్రం విజయం వరించేవరకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే సత్యదేవ్ నటించిన తాజాగా చిత్రం సమవర్తి (Samavarthi). అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై శివ చరణ్ రెడ్డి, పడమటి శశిధర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


సత్యదేవ్ తనదైన గంభీరమైన వాయిస్ ఓవర్‌తో, రా అండ్ రస్టిక్ అవతార్‌లో ఈ టీజర్‌లో కనిపించాడు. అడవి, పులి-జింకల నడుమ ఉండే పోలికలతో సాగే సంభాషణలతో టీజర్ మొదలయ్యింది. కష్టం వచ్చిన ప్రతిసారి కాపాడడానికి ఆ దేవుడే దిగిరావాలా? అనే డైలాగ్ తరువాత మహదేవ్ గా సత్యదేవ్ ఎంట్రీ అదిరిపోయింది. కథ పూర్తిగా రీవిల్ చేయకపోయినా.. ఒక తెగను కాపాడడానికి వచ్చిన దేవుడిలా సత్యదేవ్ కనిపించాడు. నేను నొక్కాలి.. బుల్లెట్ నెత్తిలో దిగాలి, అది నేను చూడాలి అంటూ సత్యదేవ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసాయి.


ఇక విజువల్స్ చాలా నేచురల్‌గా, అథెంటిక్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను కథా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ఈ సినిమా కోసం సత్యదేవ్ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఇక చివర్లో ఈసారి అస్సలు మిస్ అవ్వదు అని చెప్పిన డైలాగ్ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పినట్లు ఉంది. ఇక నేపథ్య సంగీతం కూడా టీజర్‌లోని మూడ్‌కు తగ్గట్లుగా కుదిరింది. వైవిధ్యమైన కథలను ఎంచుకునే సత్యదేవ్, ఈ సమవర్తి చిత్రంతో మరోసారి మాస్ అండ్ యాక్షన్ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సత్యదేవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ALSO READ:

మొదటి రాత్రి.. నిద్రపోయిన లవర్.. లేచిపోయిన భార్య..భర్త ఏం చేశాడంటే

Itllu Arjuna Teaser: ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే..

15 సెకన్ల ముద్దేగా.. బోల్డ్‌ సీన్లపై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్‌!  

Updated Date - Sep 19 , 2026 | 09:30 PM