15 సెకన్ల ముద్దేగా.. బోల్డ్ సీన్లపై రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:12 PM
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తన కెరీర్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే (Radhika apte) తన కెరీర్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గతంలో తాను బోల్డ్ పాత్రల్లో నటించిన విషయాన్ని ఆధారంగా చేసుకుని, కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో అలా నటించాలని కొందరు దర్శకనిర్మాతలు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె వెల్లడించారు. ఒక సందర్భంలో యాక్షన్ సన్నివేశం కోసం కేవలం లోదుస్తులతో నటించమని కూడా అడిగారని రాధికా ఆప్టే తెలిపారు.
"కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నేను నగ్నంగా నటించాను. దాంతో నేను ఎలాంటి సన్నివేశానికైనా సులభంగా ఒప్పుకుంటానని కొందరు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కథకు, పాత్రకు అవసరం లేని సన్నివేశాల్లో నటించడానికి నేను అంగీకరించను. సినిమాలో సన్నిహిత సన్నివేశం ఎందుకు అవసరమో ముందుగా నాకు స్పష్టంగా చెప్పాలి. కొందరు మాత్రం ‘ఓ 15 సెకన్ల ముద్దు సీన్ చేసేయండి’ అంటూ చాలా తేలికగా మాట్లాడుతుంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు నాకు నవ్వొస్తుంది. ఒకసారి ఓ సినిమా యాక్షన్ సన్నివేశం కోసం షర్ట్ బటన్లు విప్పేసి నటించగలరా? అని నన్ను అడిగారు. యాక్షన్ సీన్‌లో వేగంగా కదలాల్సి ఉంటుంది కాబట్టి అలా చేయడం కుదరదని చెప్పాను. అయినా సరే.. కనీసం లోదుస్తులతో అయినా ఆ సన్నివేశం చేయాలని అడిగారు. అసలు ఆ సీన్ ద్వారా ఏం చూపించాలనుకుంటున్నారు? అని నేను ప్రశ్నించాను. చివరకు ఆ సన్నివేశంలో నటించేందుకు నేను నిరాకరించాను. నన్ను అలా అడిగిన వ్యక్తి పేరు చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆయన సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు వస్తాయని ఎవరూ ఊహించరు. కేవలం సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో నటీమణులను తమకు ఇష్టం లేని సన్నివేశాల్లో నటించేలా ఒత్తిడి చేయడం సరికాదు. కథ, పాత్రకు అవసరమైన సన్నివేశాల్లో నటించడం వేరు.. కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి హద్దులు దాటేలా ఒత్తిడి చేయడం వేరు’’ అని రాధికా ఆప్టే అన్నారు. ప్రస్తుతం రాధికా ఆప్టే ‘లస్ట్ స్టోరీస్ 3’లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు నటించారు.
ALSO READ:
Raaka: 'రాకా’పై శిబి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..
Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా
Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు