మొదటి రాత్రి.. నిద్రపోయిన లవర్.. లేచిపోయిన భార్య..భర్త ఏం చేశాడంటే
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:33 PM
ఈమధ్యకాలంలో టాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమల్లో చిన్న సినిమాల హవా బాగా పెరిగింది. స్టార్ క్యాస్టింగ్, మైండ్ బ్లాకింగ్ బడ్జెట్‌లతో సంబంధం లేకుండా కొత్త కొత్త వినూత్న కథలతో, బలమైన కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.
ఈమధ్యకాలంలో టాలీవుడ్ సహా అన్ని సినీ పరిశ్రమల్లో చిన్న సినిమాల హవా బాగా పెరిగింది. స్టార్ క్యాస్టింగ్, మైండ్ బ్లాకింగ్ బడ్జెట్‌లతో సంబంధం లేకుండా కొత్త కొత్త వినూత్న కథలతో, బలమైన కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో విడుదలై ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి మంచి ఆదరణ పొందిన మొద రాత్రి (Modha Rathri). రిషికాంత్, అనిష్మా అనిల్‌కుమార్ జంటగా రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 21 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ శుక్రవారం మోద రాత్రి తెలుగు డబ్బింగ్ రూపంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా కథేంటి? ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే.. మారుతి.. ఇంట్లో వాళ్ల మీద కోపంతో దుబాయ్ లో ఆరేళ్లుగా పని చేస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళు సడెన్ గా మారుతికి చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేస్తారు. ముత్తు లక్ష్మీ అలియాస్ బుజ్జికి కూడా ఈ పెళ్లి ఇష్టం ఉండదు. పెద్దలు బలవంతం వలన ఒకరినొకరు అసలు ఇష్టపడని వారిద్దరి వివాహం జరుగుతుంది. అసలు ఈ పెళ్లే వద్దనుకున్న వారిద్దరి మొదటి రాత్రిలో ముత్తు లక్ష్మీ తనకు నచ్చినవాడితో పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ తెలిసి మారుతి ఏం చేశాడు..? ముత్తు లవర్ ఆమెను తీసుకెళ్లాడా.. ? ఆ ఒక్క రాత్రిలో వారి జీవితాల్లో అనుకోకుండా ఎదురైన సమస్యలేంటి? మారుతి గతం ఏంటి..? ఆ విచిత్రమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ నూతన దంపతులు పడే తాపత్రయం ఎలాంటి గందరగోళానికి దారితీసింది? చివరికి మారుతి- ముత్తు మొదటి రాత్రి ఎలా జరిగింది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ మధ్యకాలంలో డబ్బులు ఉన్నాయని పెళ్లి చేయడమే కానీ.. పెద్దలు, పిల్లల మనసుల్లో ఎవరు ఉన్నారు.. ? అనేది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే పెళ్లి తరువాత జరగరాని ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఇదే ఈ సినిమాలో చూపించారు. కులం, మతం అంటూ కొందరు.. డబ్బులేదని ఇంకొందరు ప్రేమించినవారిని విడదీస్తున్నారు. దీనివలన ప్రేమ విఫలమైందని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ చాలా సున్నితంగా చెప్పాడు. ఆడపిల్లకు చదువు ఎందుకు అని, బయటకు పంపిస్తే లేచిపోతుందని భయపడి ఎవడో ఒకడిని ఇచ్చి కట్టబెట్టడం వలన జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి.. ? అనేది ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఆడపిల్ల మనసులో పెళ్లి అంటే ఉండే భయం అద్భుతంగా చూపించారు. అసలు పెళ్లి అంటే ఏంటి..? దాని అర్ధం ఏంటి అనే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
ఇక హీరోగా నటించిన రిషికాంత్, హీరోయిన్‌గా నటించిన అనిష్మా అనిల్‌కుమార్ ఇద్దరూ సరికొత్త నటనతో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు పరిచయం లేని కొత్త జంటగా వారిద్దరి మధ్య ఉండే సంకోచం, భయం, ఆ తర్వాత వచ్చే కామెడీ టైమింగ్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా సహజంగా కుదిరింది. సినిమా మొత్తం అనిష్మా తన నటనతో అదరగొట్టింది. ఇక ఇతర కీలక పాత్రల్లో నటించిన చేతన్, వి విక్టరీ వెంకటేష్, భగవతి పెరుమాళ్ (బక్స్) తమ అనుభవంతో కామెడీ సన్నివేశాలను బాగా పండించారు.
దర్శకుడు రాజా కరుప్పసామి ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయినా, ఒక్క రాత్రిలో జరిగే డ్రామాను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. కామెడీతో పాటు ఎమోషన్స్‌ను సమపాళ్లలో మిక్స్ చేశాడు. భరత్ శంకర్ అందించిన నేపథ్య సంగీతం కథలోని మూడ్‌కి తగ్గట్లుగా ఉంది. సురేంద్రన్ పరంజోతి సినిమాటోగ్రఫీ ఒకే ఇంట్లో జరిగే సన్నివేశాలను కూడా బోర్ కొట్టకుండా విజువల్‌గా రిచ్‌గా చూపించాడు. అశోక్ అర్జునన్ ఎడిటింగ్ కథనాన్ని వేగంగా నడిపించడంలో తోడ్పడింది.
దర్శకుడు రాజా కరుప్పసామి మోద రాత్రి చిత్రాన్ని ఒక క్లీన్ అండ్ సింపుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాడు. ఎలాంటి అనవసరమైన హంగామా లేకుండా ఒక రాత్రి జరిగే విచిత్రమైన సంఘటనల చుట్టూ కథను ఆసక్తికరంగా నడిపించాడు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, సిట్యుయేషనల్ కామెడీ, హీరో హీరోయిన్ల పర్‌ఫార్మెన్స్ సినిమాను ముందుకు నడిపిస్తాయి. వీకెండ్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రశాంతంగా కూర్చుని ఒక సరదా చిన్న సినిమా చూడాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
ALSO READ:
Raaka: 'రాకా’పై శిబి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..
Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా
Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు