Samantha: మా ఇంటి బంగారం సెన్సార్ పూర్తి!
ABN , Publish Date - Jun 10 , 2026 | 06:25 PM
సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా ఈ నెల 19న విడుదల కాబోతోంది.
ప్రముఖ కథానాయిక సుమంత హీరోయిన్ గా నటించి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. నందినీరెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 19న విడుదల కాబోతున్న 'మా ఇంటి బంగారం' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సినిమాలోని అన్ని ఎమోషన్స్ కు చోటు ఉందని, ఇదో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సమంత చెబుతున్నారు.
'యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా సీన్ ఏదైనా సమంత అదరగొట్టేశారని, తాను సమంత అభిమానిగానే మానిటర్ ముందు కూర్చుని చూశాన'ని దర్శకురాలు నందినీరెడ్డి తెలిపింది. 'మా ఇంటి బంగారం’ అనే పేరులో ఎంతో ఎఫెక్షన్, లవ్ ఉంటుందని, అయితే దాని వెనకాల డార్క్ సైడ్, పొసెసివ్ నెస్ కూడా ఉందని రాజ్ నిడియోరు అన్నారు. ఈ సినిమాకు ఆయన వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్‌తో కలిసి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. మీ బంగారాలతో కలిసి థియేటర్‌కు వచ్చేయమంటూ చిత్ర బృందం అందరినీ ఆహ్వానిస్తోంది. మరి ఈ నెల 19న విడుదల కాబోతున్న 'మా ఇంటి బంగారం'కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, మంజూష తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం
కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..
Drishyam 3: అందుకే.. వెంకటేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అసలు గుట్టు.. బయట పెట్టిన డైరెక్టర్