సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: తల్లిదండ్రులైన సమంత-రాజ్ నిడిమోరు.. బాబుకి పేరు కూడా పెట్టేశారు..

ABN, Publish Date - Nov 20 , 2026 | 02:00 PM

మొన్నటి వరకు బేబీ బంప్‌తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన స్టార్ హీరోయిన్‌ సమంత ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందారు. పండంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చారు.

నటి సమంత (Samantha) తల్లైంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరు కి వారసుడిని ఇచ్చింది. ఈ క్యూట్ పెయిర్‌ పండంటి మగబిడ్డ కి తల్లిదండ్రులయ్యారు. తమ బుజ్జాయికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే సోషల్ మీడియాలో ప్రకటించడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత కొద్దిరోజులుగా బుజ్జాయి రాక కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ వార్త నిజమైన పండగను తీసుకొచ్చింది.

గత కొంతకాలంగా వినిపిస్తున్న సమంతకు కవలలకు జన్మనివ్వబోతోందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సమంత షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చిన్నారి రాకతో తమ జీవితంలో కొత్త వెలుగు.. అనంతమైన ఆనందం నిండిందన్న భావనతో ఆమె చేసిన పోస్ట్ బయటకు వచ్చిన నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వేలాది కామెంట్లతో వైరల్ అవుతోంది.

రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరు, తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు నిజ జీవితంలో తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన సామ్ జీవితంలో ఈ మధుర ఘట్టం చోటుచేసుకోవడం పట్ల ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. 'దేవ్ నిడిమోరు' రాకతో సమంత-రాజ్ దంపతుల జీవితంలో మరిన్ని సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆశీస్సుల వర్షం కురిపిస్తున్నారు.

ALSO READ:'

‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

Sai Pallavi: తాతయ్య ఇచ్చిన కానుక.. ఇప్పటికీ వదలని సాయి పల్లవి

శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Updated Date - Nov 20 , 2026 | 02:35 PM