సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందా..?

ABN, Publish Date - Mar 28 , 2026 | 12:29 PM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలో పెళ్ళి చేసుకోబోతుందంటూ వినిపిస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.

వెండితెరపై మేకప్ లేకుండా మెరిసిపోయే నటి ఎవరంటే మనందరి నోట వినిపించే ఏకైక పేరు సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాలో మలర్ టీచర్‌గా కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టించిన ఈ ముద్దుగుమ్మ, అనతి కాలంలోనే సౌత్ ఇండియా మొత్తం తన ముద్ర వేసింది. కేవలం నటనతోనే కాకుండా, తనదైన డాన్స్ స్టెప్పులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించిన ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. సాయి పల్లవి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని, ఇప్పటికే రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.


సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల పట్ల అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ వివాహం గురించి వార్తలు వస్తే అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఆమె త్వరలో ఒక బిజినెస్‌మెన్‌ను వివాహం చేసుకోబోతోందని ప్రచారం మొదలైంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఆమె సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందని కూడా పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్తలన్నింటికీ సాయి పల్లవి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉందని ఆమె స్పష్టం చేసింది. పెళ్లి చేసుకునే ఆలోచన ప్రస్తుతానికి అస్సలు లేదని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించడమే తన తక్షణ లక్ష్యమని ఆమె తేల్చి చెప్పింది. సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే, గతేడాది 'తండేల్' చిత్రంతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె తన సత్తాను చాటడానికి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. హిందీలో రెండు భారీ ప్రాజెక్టులతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అందులో మొదటిది అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన నటిస్తున్న చిత్రం. ఈ సినిమాకు హిందీలో 'ఏక్ దిన్' అని పేరు పెట్టగా, తెలుగులో ఒక రోజు అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. మే 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో నార్త్ ప్రేక్షకులను కూడా సాయి పల్లవి తన మాయలో పడేయడం ఖాయమనిపిస్తోంది.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా 'రామాయణ్'. ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. భారతీయ పురాణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె నటన ఎలా ఉండబోతుందోనని యావత్ భారతం ఆసక్తిగా ఉంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 8న విడుదల కానుంది. గ్లామర్‌కు దూరంగా ఉంటూ, కేవలం నటనతోనే మెప్పించడం ఈ మద్య కాలంలో సాయి పల్లవికే సాధ్యమైంది. సౌత్ నుంచి నార్త్ వరకు ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పెళ్లి వార్తలు ఎలా ఉన్నా, ఆమె మరిన్ని మంచి చిత్రాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

Read Also: హోంబలేతో తెగిపోయిన బంధం...

Read Also: విజయ్‌ ఆఖరి చిత్రానికి ఇన్ని కష్టాలా

Updated Date - Mar 28 , 2026 | 01:37 PM