సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అటు మధుబాల... ఇటు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి!

ABN, Publish Date - Mar 16 , 2026 | 02:03 PM

బీటౌన్‌లో ఇంకా అడుగుపడనే లేదు అప్పుడే హాట్ టాపిక్‌గా మారింది సాయిపల్లవి. అప్పుడే నేచరల్ బ్యూటీ చేతికి అరడజను ప్రాజెక్టులు వచ్చేశాయి. కన్ఫర్ మేషన్ అయితే కాలేదు కానీ వస్తున్న ఇన్ఫర్మేషన్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

బాలీవుడ్‌ డెబ్యూ మూవీ రిలీజ్ కాక ముందే నేచురల్ స్టార్ సాయి పల్లవి హాట్ టాపిక్ అవుతోంది. జునైద్ ఖాన్‌తో కలిసి 'ఏక్ దిన్'లో నటిస్తున్న ఈ బ్యూటీ.. రణ్‌బీర్ కపూర్‌తో కలసి 'రామాయణం'లో సీతాదేవి పాత్రలో కనిపించనుంది. 'ఏక్‌దిన్' ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా అందులో సాయి పల్లవి పెర్ఫార్మెన్స్‌కు నార్త్ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ రెండు భారీ సినిమాల రిలీజ్‌కు ముందే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తికరమైన ఆఫర్లు ఇస్తుండటం మరింత ఆసక్తికరంగా మారుతోంది.


భారతరత్న, ప్రముఖ గాయని, స్వర్గీయ ఎం. ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో లీడ్ రోల్ చేయడానికి సాయిపల్లవిని ఫైనలైజ్ చేసినట్టు రిపోర్ట్స్‌ వస్తున్నాయి. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. సాయిపల్లవి ఈ సినిమా కోసం కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది.

మరో లెజెండరీ యాక్ట్రస్‌ మధుబాల బయోపిక్‌లోనూ సాయిపల్లవి ప్రధాన పాత్రలోనూ కనిపించబోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించే ఈ ప్రాజెక్ట్‌లో కియారా అద్వానీ, అనీత్ పద్దా వంటి వారి పేర్లు వినిపించినా, ఇంకా ఫైనల్ కాస్టింగ్ జరగలేదు. అయితే మేకర్స్ మాత్రం సాయిపల్లవినే తీసుకోవాలని భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Also: తమిళ, మలయాళ దర్శకులతో ప్రభాస్!

Read Also: ఆస్కార్‌: రెండు సినిమాలు టై.. ఇలా జరగడం ఏడోసారి

Updated Date - Mar 16 , 2026 | 03:26 PM