సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎంగేజ్‌మెంట్ తర్వాత తేజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

ABN, Publish Date - Nov 07 , 2026 | 02:21 PM

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, ఆనందకరమైన ఘట్టం మొదలైంది. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలైన కిరణ్‌తో కొత్త జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Sai Dharam Tej and Kiran

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, ఆనందకరమైన ఘట్టం మొదలైంది. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలైన కిరణ్‌ (Kiran)తో కొత్త జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం (5 నవంబర్, 2026) హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ (Hilton Hyderabad Genome Valley Resort) వేదికగా వీరి నిశ్చితార్థ వేడుక ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జరిగింది. మెగా, అల్లు కుటుంబాలకు చెందిన యంగ్ జనరేషన్ సభ్యులందరూ కలిసి దిగిన పిక్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా, వివాహాన్ని డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఈ వేడుక ముగిసిన అనంతరం సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా వేదికగా మొదటిసారి స్పందిస్తూ పెట్టిన పోస్ట్ నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. తన కాబోయే భార్య కిరణ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చేయి వేసి నడిచి వస్తున్న ఒక అందమైన ఫోటోను ఆయన పంచుకున్నారు. ఆ ఫోటోతో పాటు ‘ఐ లవ్ యూ’ (I Love You) అంటూ తన ప్రేయసిపై ఉన్న ప్రేమను తెలియజేసేలా క్యాప్షన్ రాసుకొచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉండే సాయి దుర్గ తేజ్, తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ పెట్టిన ఈ పోస్ట్‌లో ఆయన ముఖంలోని సంతోషం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.


తేజ్ షేర్ చేసిన ఈ రొమాంటిక్ పిక్‌ను క్షణాల్లోనే నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలే.. ఇప్పుడు జీవితాంతం తోడుండే పవిత్రమైన బంధంగా మారడంతో మెగా కాంపౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, కిరణ్‌కు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటి వరకు రివీల్ కానివ్వలేదు. ఆమె ఎవరు? ఏంటి? అనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెర్చింగ్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10న జరగనున్న వివాహ మహోత్సవం కోసం ఇండస్ట్రీ వర్గాలు, మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు సాయి దుర్గ తేజ్ నటించిన ‘సంబరాల యేటి గట్టు’ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

వెంకీ విక్టరీకి అనిల్ రావిపూడినే దిక్కా..?

ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే

నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్

Updated Date - Nov 07 , 2026 | 02:21 PM