టాలీవుడ్లో రుహానీ శర్మ మళ్లీ బిజీ!
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:31 PM
రుహానీ శర్మ నటించిన రెండు తెలుగు సినిమాలు నెల రోజుల వ్యవధిలో విడుదలకు సిద్ధమయ్యాయి. 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న, 'ఆల్కహాల్' డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఎనిమిదేళ్ళ క్రితం 'చి.ల.సౌ.' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ ఆ తర్వాత ఆరేడు సినిమాల్లో కథానాయికగానో లేదా కీలక పాత్రలనో పోషించారు. అయితే ఆమె ప్రతిభకు తగ్గ గుర్తింపు తెలుగులో ఇంకా దక్కలేదు. చివరగా రెండేళ్ళ క్రితం 'శ్రీరంగనీతులు' చిత్రంలో హీరోయిన్ గా నటించారామె. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన మరే సినిమా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు నెల రోజుల గ్యాప్ లో ఆమె చిత్రాలు రెండు వస్తున్నాయి. అందులో మొదటిది 'ఆకాశంలో ఒక తార'. పెద్ద కలలతో ముందుకు సాగాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన కలలను నిజం చేసుకునే ప్రయాణంలో హీరో ఆమెకు అండగా నిలుస్తాడు. ఈ చిత్రంలో రుహానీ శర్మ బిజిలీ అనే పాత్రను పోషించారు. అనుకోని సమయంలో కథలోకి ప్రవేశించి, అప్పటివరకు సాగుతున్న ప్రయాణానికి కొత్త వెలుగును తీసుకొచ్చే పాత్ర బిజిలీ ది అని మేకర్స్ చెబుతున్నారు. అనుకోకుండా ఎదురయ్యే ఓ పరిచయం.. ఆ ప్రయాణంలో ఊహించని అందమైన అనుభూతులను తీసుకొస్తుందని తెలిపారు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.
అలానే రుహానీ శర్మ హీరోయిన్గా నటించిన సినిమా 'ఆల్కహాల్'. 'అల్లరి' నరేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మెహర్ తేజ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. అల్లరి నరేశ్ ఇంతవరకూ పోషించిన ఓ సరికొత్త పాత్రలో ఇందులో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నటిగా తనకు మరింత గుర్తింపును తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని రుహానీ శర్మ వ్యక్తం చేస్తుంది. ఈ సినిమా ఈ యేడాది జనవరి 1నే ఇది విడుదల కావాల్సింది. కానీ ఊహించని విధంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడీ సినిమా డిసెంబర్ 18న జనం ముందుకు వస్తోంది. అంటే కేవలం నెలరోజుల వ్యవథిలో రుహానీ శర్మ నటించి రెండు తెలుగు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ వస్తున్నాయన్నమాట. ఈ చిత్రాల తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్న మాట.
ఇవి కూడా చదవండి:
మిడ్నైట్ అప్డేట్స్.. జక్కన్నా నీ స్ట్రాటజీని అందుకోవడం కష్టమే..
James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్.. అదిరిపోయాడు