‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్‌.. ‘రోమియో జూలియట్‌’ మరోసారి వాయిదా!

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:37 AM

‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల ప్రభావంతో చిన్న చిత్రాల రిలీజ్‌ డేట్స్ మారుతున్నాయి. అక్టోబర్ 30న రావాల్సిన ‘రోమియో జూలియట్‌’ మూవీని నవంబర్ 13కి వాయిదా వేశారు. హర్షిత్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని భార్గవ్‌ మాచర్ల తెరకెక్కించారు.

Romeo Juliet Movie

'ఆదర్శ కుటుంబం' దెబ్బకు చిన్న సినిమాల రిలీజ్‌ డేట్స్ మారిపోతున్నాయి. అక్టోబర్ 30న రావాల్సిన పలు చిత్రాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. 'చంద్రయాన్‌' మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ అర్థాంతరంగా ఆపేయగా, 'సమ్మర్ హాలిడేస్‌' చిత్రాన్ని నవంబర్ 6కి వాయిదా వేసుకున్నారు నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. అంతేకాదు... పెద్ద సినిమాల విడుదల తేదీని ఇలా హఠాత్తుగా ప్రకటించడంతో తమ లాంటి చిన్న చిత్రాల నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుతాయో మీడియా ముందు ఏకరవు పెట్టారు.


ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన 'రోమియో జూలియట్‌' సినిమా సైతం మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. జూలై నెలాఖరులో విడుదల కావాల్సిన 'రోమియో జూలియెట్‌' మూవీని ఈ నెల 23న విడుదల చేస్తామని మొదట చెప్పారు. ఆ తర్వాత దానిని 30కి వాయిదా వేశామని ప్రకటించారు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' కారణంగా ఈ సినిమాను ఏకంగా నవంబర్‌ 13కి వాయిదా వేశారు. హర్షిత్‌, విశాఖ ధిమాన్‌ జంటగా నటించిన ఈ సినిమాను ఈటీవీ విన్‌ సమర్పణలో సుందీప్ ఎన్ వెంకటేశ్వరరావు నిర్మించారు. భార్గవ్‌ మాచర్ల రచన చేసి దర్శకత్వం వహించారు. నేటి యువతరం తమ ప్రేమ సంబంధాల్లో ఎదుర్కొంటున్న అనుభవాలు, ఆలోచనలకు అద్దం పట్టేలా జెన్ జీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

వైవా హర్ష, సిరి హనుమంత్‌, ప్రసాద్‌ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్‌ ఘోష్‌, అజయ్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు భార్గవ్‌ మాచర్లతో కలిసి ప్రశాంత్‌ రాగతి కథను అందించారు. గోపీ మోహన్‌ సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి:

Haiku Review: సినిమా రివ్యూ: హైకూ

‘నా వైఫ్ మిస్సింగ్’.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మూవీ ఎలా ఉందంటే?

నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ

‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం

స్టార్ హీరోతో ప్రభుదేవా సినిమా.. దర్శకుడిగా టాలీవుడ్‌ రీఎంట్రీ

Updated Date - Oct 23 , 2026 | 10:43 AM