సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!

ABN, Publish Date - Oct 02 , 2026 | 06:16 PM

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రెండో చిత్రం RC17 కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో వార్త బాగా హైలెట్ అవుతోంది.

RC17 New Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar).. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న రెండో చిత్రం RC17 కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దానికి కారణం రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘రంగస్థలం’. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇందులో వినికిడి లోపం ఉన్న ‘చిట్టిబాబు’ పాత్రలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కమర్షియల్ హంగులతో పాటు ఒక బలమైన భావోద్వేగ ప్రయాణాన్ని అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది.


ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌లో రానున్న RC17కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవంతోనే అభిమానులకు మేకర్స్ ఓ బిగ్ అప్‌డేట్ కూడా ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. దసరా నాడు ఓపెనింగ్ చేసి.. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. డిసెంబర్ 2027 నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని డైరెక్టర్, మైత్రీ మూవీ మేకర్స్ ఒక గడువును నిర్దేశించుకున్నారట. అంటే సరిగ్గా 12 నెలల్లో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యంతో సుకుమార్ అండ్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


అయితే, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో.. ప్రతి విషయాన్ని పర్పెక్ట్‌గా చేసే సుకుమార్‌కి ఇదొక ఆసక్తికరమైన నిర్ణయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకసారి పెద్ద బడ్జెట్ సినిమా షూటింగ్ ప్రారంభమైతే, లొకేషన్లు, సెట్లు, యాక్షన్ సీన్లు, నటీనటుల డేట్లు వంటి వివిధ కారణాల వల్ల షెడ్యూల్స్ పొడిగించవలసి వస్తుందని అంటున్నారు. సినిమా ప్రొడక్షన్‌లో ఎంత ఎక్కువ కాలం ఉంటే, అన్ని విభాగాలను ఒకే దారిలో నడిపించడం అంత కష్టమవుతుంది. ఇటీవల పెద్ద హీరోల సినిమాలు చెప్పిన టైమ్ రాకపోవడం చూస్తూనే ఉన్నాం. దీంతో RC17కి డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ అన్ని కలిసిరావాలి. ఒకవేళ ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటి డెడ్ లైన్‌కి కట్టుబడి పూర్తైతే.. విడుదలకు ముందే ఒక పెద్ద ఘనత సాధించినట్లే అవుతుంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడిగా పలువురి పేరులు వినిపిస్తున్నాయి కానీ ఎవరిపేర్లు ఫైనల్ కాలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది?.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!

‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్

డబ్బులిచ్చి మరి ‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారా? నమ్మవచ్చా!

Updated Date - Oct 02 , 2026 | 06:16 PM