సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

ABN, Publish Date - Oct 14 , 2026 | 02:06 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ RC17 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

RC17

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పెద్ది తరువాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ RC17 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా.. ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పూజా కార్యక్రమాలు జరిగినమాట వాస్తవమే కానీ.. అది సినిమా ఓపెనింగ్ కాదు.


ఎప్పటినుంచో ఈ సినిమా కోసం మేకర్స్ ఒక ఆఫీస్ ని తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కేటాయించిన కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలను మేకర్స్ పూర్తిచేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీంతో RC17 పూజ ఎప్పుడు ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. మొదటి నుంచి కూడా ఈ సినిమా దసరా రోజునే మొదలుకానుందని వార్తలు వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం దసరా రోజునే RC17 పూజ జరగనుందట. లేకపోతే దసరా తరువాత రెండు రోజులు అటుఇటు అవ్వనుందని, కచ్చితంగా దసరాకే RC17 మొదలుకానుందని టాక్.


రామ్ చరణ్ - సుకుమార్ కాంబోపై నెటిజన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ని చరణ్ కి ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు మరోసారి అంతకన్నా పెద్ద హిట్ నే చరణ్ కి ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈసారి సుకుమార్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ని మార్చడం కూడా కొత్త ఆశలను చిగురించేలా చేస్తోంది. కోలీవుడ్ ని షేక్ చేస్తోన్న అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు అని తెలియడంతో హైప్ మరింత పెరిగింది. మరి RC17 ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం

Drishyam 3: 10 రోజుల్లోనే రూ.480 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దృశ్యం 3!

Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది

Updated Date - Oct 14 , 2026 | 02:06 PM