రవితేజ ‘ఇరుముడి’ తాజా అప్డేట్ ఇదే.. ఆ తేదీనే విడుదల
ABN , Publish Date - Jul 20 , 2026 | 08:39 PM
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ మూవీ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా, శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi). ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్, ఆ తర్వాత విడుదల చేసిన తొలి పాట ‘ఇరుముడి కట్టు’తో సినిమా కోసం వేచి చూసేలా చేశారు. అయ్యప్ప స్వామిపై భక్తి భావాన్ని ఆవిష్కరించిన ఆ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.
తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన హీరో రవితేజ.. ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన డబ్బింగ్ స్టూడియో వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. వీడియోలో ‘నాకు ఒకే ఒక్క కూతురే.. పేరు మనమ్మ" అంటూ.. రవితేజ ఎంతో ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆ ఒక్క డైలాగ్‌తోనే సినిమాలో తండ్రి-కూతురు మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని దర్శకుడు చూపించబోతున్నారనే ఆసక్తిని మరింతగా పెంచేశారు. ఈ వీడియోలో బేబీ నక్షత్ర, దర్శకుడు శివ నిర్వాణ కూడా కనిపించారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. కేవలం మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. అంతేకాదు, సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో వస్తుందని, రిలీజ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించారు. అలాగే సినిమా నుంచి రెండో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి:
‘చెన్నై లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. విడుదలకు సిద్ధం
అట్లీ ‘జవాన్’ కనెక్షన్.. ‘రాకా’లో తెలుగమ్మాయ్!
క్లాస్ మెసేజ్‌తో నటసింహం మాస్ విధ్వంసం..!