సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: రష్మిక తెలంగాణ యాసపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

ABN, Publish Date - Sep 05 , 2026 | 02:54 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు తెలంగాణ కోడలు. విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత దగ్గరవుతున్న సంగతి తెలిసిందే.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇప్పుడు తెలంగాణ కోడలు. విజయ్ దేవరకొండతో (vijay Devarakonda) వివాహం తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. కన్నడ నుంచి వచ్చినా..  ఆమె తెలుగు మాట్లాడటానికి ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రస్తుతం తెలంగాణ కోడలు కాబట్టి ఈ యాసలోనూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

తాజాగా రష్మిక మాట్లాడిన తెలంగాణ యాస సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక.. ఆనంద్ గురించి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ యాసలో మాట్లాడారు. ఆమె పలికిన కొన్ని పదాలు పక్కా తెలంగాణ యాసలో ఉండగా.. మరికొన్ని పదాలు పలకడంలో  చిన్నచిన్న తేడాలున్నాయి. దీంతో సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు నెటిజన్లు. అయితే అభిమానుల కోసం రష్మిక చేసిన ప్రయత్నాన్ని కొందరు అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం తెలంగాణ యాసను పూర్తిగా తెలియకుండా మాట్లాడటం అవసరమా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు అంత ఫోర్స్‌డ్‌గా మాట్లాడటం ఎందుకు అని పోస్ట్లు పెడుతున్నారు. 

మొదట్లో రష్మిక మాట్లాడిన  తెలుగు కన్నా ఇప్పుడు చాలా బెటర్. తన సినిమాలకు తానే స్వయంగా  డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఇప్పుడిప్పుడే ఆమె  తెలంగాణ భాష, యాస, సంస్కృతితో మమేకం అవుతోంది. కొత్త యాసను నేర్చుకుని, ధైర్యంగా మాట్లాడేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాల్సిందే అని కొందరు నెటిజన్లు అంటున్నారు. 

ALSO READ:

Vishwambhara: OTT డీల్‌ కోసమే ఎదురుచూపులు.. డీల్‌ లాక్ అయితే రిలీజ్ డేట్‌ ఫిక్స్!

ఇత‌నే నా ల‌వ‌ర్‌.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్‌

Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?




Updated Date - Sep 05 , 2026 | 03:11 PM